చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్ర‌పంచ క్రికెట్‌లోనే ఏకైక ఆట‌గాడు..

Must read

Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ వ‌న్డే క్రికెట్‌లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 13 వేల ప‌రుగులు సాధించిన తొలి క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 12 ప‌రుగుల వ‌ద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

వ‌న్‌డౌన్‌లో కోహ్లీ.. 251 ఇన్నింగ్స్‌ల్లోనే 61.55 స‌గ‌టుతో 13 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇందులో 48 సెంచ‌రీలు, 70 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక ఓవ‌రాల్‌గా కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్డేల్లో 318 వ‌న్డేల్లో 15 వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ చ‌క్క‌ని ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతులు ఎదుర్కొన్నాడు. 13 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 74 ప‌రుగులు సాధించాడు. కోహ్లీ రాణించాడంతో తొలి వ‌న్డేలో భార‌త్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా 5 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!