ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

Must read

Srinath Maganti : టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుల్లో శ్రీనాథ్ మాగంటి ఒకరు. ‘హిట్’ ఫ్రాంచైజీతో ఫేమ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఆయ‌న ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. నలుగురు హీరోల్లో తను ఒకడు. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

మంగ‌ళ‌వారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఎప్పటిలానే.. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ తమ త‌మ‌ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఆ గ్యాంగులో కొత్తగా చేరిన శ్రీనాథ్ సైతం అదరగొట్టేశాడు. నిజం చెప్పాలంటే.. ఆల్రెడీ ఆడియెన్స్‌లో రిజిష్టర్ అయిన పాత్రలో మెప్పించడం అంటే అంత సామాన్యమైన విష‌యం కాదు. అయితే.. ట్రైలర్‌ను చూస్తే కార్తిక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయాడని అనిపిస్తోంది. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది.

ట్రైలర్‌లో కార్తీక్‌గా శ్రీనాథ్ కామెడీ టైమింగ్, లుక్, ప్రజెన్స్ అన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. ఆ పాత్ర ఒక పట్టణ యువకుడు, సంప్రదాయ వృత్తిపరమైన ఎదుగుదల కంటే తన అభిరుచిని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే కాన్ ఫ్లిక్ట్స్ మధ్య నలిగిపోతుంటాడు. ఈ సీక్వెల్‌లో కార్తిక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయినట్లు క‌నిపిస్తోంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!