క‌ల్కి 2 పై ప్ర‌భాస్ ఫుల్ ఫోక‌స్‌..

Must read

Prabhas : వరుస ప్రాజెక్టుల‌తో ఉన్న బిజీగా ఉన్న ప్ర‌భాస్‌.. కల్కి-2పై ఫోకస్ పెట్టాడని ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 10 శాతమే పూర్తయిందని, మిగిలిన షూటింగ్‌కు సంబంధించి ఇంకా భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సి ఉందట. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడట ప్రభాస్‌.

ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రీకరణను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని డార్లింగ్ టార్గెట్‌గా పెట్టుకున్నాడట. ఫౌజీ షూటింగ్ పూర్తయిన వెంటనే వచ్చే ఏడాది కల్కి-2లో కీలక షెడ్యూల్‌లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రభాస్ పార్ట్ షూట్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు టాక్.

డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ కూడా ప్రభాస్ లైనప్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా ఉంది. ఫౌజీ, కల్కి2 షూటింగ్స్‌తో పాటు స్పిరిట్ కోసం కూడా ప్రభాస్ తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందట. ఈ మూడు భారీ చిత్రాల చిత్రీకరణలతో వచ్చే ఏడాది మొత్తం ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ షూటింగ్ షెడ్యూల్స్‌పై మూవీ యూనిట్స్‌ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్‌లో ప్రభాస్ సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కానుండటంతో.. వెయిటింగ్ ఫర్ డార్లింగ్ మూవీస్‌ అంటూ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తుతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!