రోజుకు రూ.100 దాచితే చాలు.. ఐదేళ్లలో పోస్టాఫీస్‌లో ఎంత వస్తుందో తెలుసా?

Must read

  • నెలకు రూ.3వేలు దాచితే చాలు.. ఐదేళ్లకు రూ.2.14 లక్షలు
  • చిన్న మొత్తంతో భారీ పొదుపు.. రూ.3 వేలతో ఎంత లాభమంటే?
  • మధ్యతరగతి వారికి మంచి ఛాన్స్.. RD స్కీమ్ పూర్తి లెక్కలివే

Post Office RD Scheme : చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం చాలా ఈజీ.. కానీ భవిష్యత్తు కోసం కొంతైనా దాచుకోవాలంటే మాత్రం చాలామంది ఆలోచిస్తుంటారు.. అలాంటి వారి కోసం పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ మంచి సేవింగ్ మార్గంగా చెప్పుకోవచ్చు. ప్రతినెలా చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేస్తూ ఐదేళ్లలో కొంత పెద్ద మొత్తాన్ని సంపాదించుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నెలకు రూ.3 వేలతో ఎంత లాభం? :
ఉదాహరణకు.. మీరు ప్రతి నెలా రూ.3వేలు చొప్పున పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాలో డిపాజిట్ చేస్తున్నారని అనుకుందాం.. ఇలా ఐదేళ్ల పాటు (Post Office RD Scheme) అంటే మొత్తం 60 నెలలు డబ్బులు సేవ్ చేయాలి. ఈ లెక్కన మీ జేబు నుంచి పెట్టే మొత్తం రూ.1,80,000 అవుతుంది.

Read Also : 

ప్రస్తుతం 2026 అక్టోబర్‌–డిసెంబర్ త్రైమాసికానికి ఐదేళ్ల పోస్టాఫీస్ ఆర్‌డీపై వార్షిక వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. ఈ వడ్డీని త్రైమాసిక చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. ఈ రేటుతో లెక్కిస్తే ఐదేళ్ల తర్వాత సుమారు రూ.34,097 వడ్డీ లభిస్తుంది. అంటే.. మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి దాదాపు రూ.2,14,097 అందుతాయి..

ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చా? :
అర్హత ఉన్న పెద్దలు తమ పేరుతో పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాను ప్రారంభించవచ్చు. నిబంధనల ప్రకారం.. మైనర్ల పేరుతో కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.. కనీసం నెలకు రూ.100తోనే ఈ స్కీమ్ ప్రారంభించవచ్చు..

ఈ విషయాలు గుర్తుంచుకోండి :
ప్రతి నెలా నిర్ణీత తేదీలో వాయిదా చెల్లించాలి. ఆలస్యమైతే జరిమానా పడుతుంది. మధ్యలో ఖాతా క్లోజ్ చేయాలన్నా కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. అలాగే వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను నిబంధనలు వర్తిస్తాయి. చిన్న మొత్తంతో రెగ్యులర్ సేవింగ్ చేయాలనుకునే వారికి ఈ స్కీమ్ అద్భుతంగా ఉంటుంది. అయితే, పెట్టుబడి పెట్టే ముందు పోస్టాఫీస్‌లో లేటెస్ట్ వడ్డీ రేట్లు, నిబంధనలు తెలుసుకోవడం చాలా మంచిది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!