జియో యూజర్లకు పండగే.. సినిమాలు, గేమ్స్, డౌన్‌లోడ్స్.. రూ.15తో రోజంతా నచ్చినంత డేటా!

Must read

  • కేవలం రూ.15కే 24 గంటలు అన్‌లిమిటెడ్ 5G డేటా..
  • తక్కువ ధరకే భారీ డేటా.. జియో కొత్త రూ.15 ప్లాన్‌లో ఏమున్నాయంటే?
  • రోజంతా ఇంటర్నెట్ వాడుకోవాలా? జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ఇదే

Jio Cheapest Plan : స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఇంటర్నెట్ వాడకం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు చూడాలన్నా, గేమ్స్ ఆడాలన్నా, భారీ ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా డేటా ఎక్కువగానే ఖర్చవుతుంది. ఇలాంటి వారికి రిలయన్స్ జియో ఓ ప్రత్యేక డేటా ప్యాక్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. కేవలం రూ.15తో 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటా అందించే ఈ ప్యాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

రూ.15 ప్లాన్‌లో ఏమేం ఉన్నాయి? :
జియో ప్రకారం.. ఈ కొత్త డేటా ప్యాక్ ధర రూ.15 మాత్రమే. వ్యాలిడిటీ 24 గంటలు. ఈ సమయంలో అన్‌లిమిటెడ్ 5G డేటాను నచ్చినంతగా వాడుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ ఇంటర్నెట్ వాడేవారికి ఈ ప్యాక్ సూపర్.. అయితే ఈ బెనిఫిట్ పొందాలంటే 5జీ సపోర్ట్ చేసే ఫోన్, జియో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది.

Read Also : 

సినిమాలు, గేమ్స్‌కు బంపర్ ఆఫర్ :
ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసేవారు, యూట్యూబ్‌లో గంటల తరబడి వీడియోలు చూసేవారికి ఈ ప్యాక్ అద్భుతంగా ఉంటుంది. 4K, అల్ట్రా హెచ్‌డీ వీడియోలను స్ట్రీమ్ చేయొచ్చు.. అలాగే ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారు, బిగ్ సైజులో గేమ్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ డౌన్‌లోడ్ చేసేవారికి కూడా బెస్ట్ ఆప్షన్.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లకు కూడా ఇంటర్నెట్ షేర్ చేసుకోవచ్చు. దీంతో ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా అత్యవసరంగా ఎక్కువ డేటా అవసరమైనప్పుడు అద్భుతంగా ఉంటుంది.

రీఛార్జ్ ఎక్కడ చేసుకోవచ్చు? :
మైజియో యాప్, జియో.కామ్, జియో రిటైల్ స్టోర్లు, ఇతర రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ప్యాక్‌ను పొందవచ్చు. అయితే, రీఛార్జ్ చేసే ముందు మీ నంబర్‌కు ఈ ప్యాక్ అందుబాటులో ఉందో లేదో, 5జీ అర్హతలు ఏంటో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.. తక్కువ ఖర్చుతో ఒక్కరోజు ఎక్కువ డేటా వాడాలనుకునే జియో కస్టమర్లకు ఈ రూ.15 ప్యాక్ ఆకర్షణీయమైన ఆప్షన్‌..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!