అగ్నివీరులకు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్.. పదవీకాలం పొడిగిస్తూ కీలక నిర్ణయం!

Must read

Agniveer Tenure Extended: భారత సాయుధ దళాల్లో బలగాల నియామకం కోసం ప్రవేశపెట్టిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘అగ్నిపథ్’ (Agnipath) పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నాలుగేళ్లుగా ఉన్న అగ్నివీర్‌(Agniveer Tenure Extended)ల పదవీకాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో అగ్నివీరుల మొత్తం సేవా కాలం ఆరేళ్లకు పెరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి త్రివిధ దళాల నుంచి దాదాపు 18 వేల మంది అగ్నివీరులు తొలి విడతగా వెనుతిరగాల్సి ఉన్న తరుణంలో కేంద్రం ఈ కీలక సవరణ చేసింది.

సాయుధ దళాల్లో కొనసాగే అవకాశం.. స్పష్టం చేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్:

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి అధికారిక ప్రకటన విడుదల చేశారు. సైనిక దళాల్లో సేవలు అందిస్తున్న అగ్నివీరులందరికీ తమ భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఈ రెండేళ్ల వెసులుబాటు లభిస్తుందని ఆయన తెలిపారు. ఆరేళ్ల సేవా కాలం పూర్తయిన తర్వాత వారి పనితీరు, ప్రతిభ ఆధారంగా శాశ్వత ఉద్యోగాలను (Permanent Jobs) కేటాయించే ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు.

పెరగనున్న శాశ్వత ఉద్యోగ అవకాశాలు.. అగ్నివీరుల్లో హర్షాతిరేకాలు:

ప్రస్తుత నిబంధనల ప్రకారం నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత కేవలం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే సైన్యంలో శాశ్వత సర్వీసుకు ఎంపిక చేస్తున్నారు. మిగిలిన వారికి ఆర్థిక ప్యాకేజీతో పాటు నైపుణ్య ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి పౌర ఉద్యోగాల్లోకి పంపుతున్నారు. అయితే పదవీకాలాన్ని ఆరేళ్లకు పొడిగించడం ద్వారా సైనిక అనుభవం పెరగడంతో పాటు, ఎక్కువ మందికి శాశ్వత ఉద్యోగాలు పొందే అవకాశాలు మెరుగవుతాయని సైనిక వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!