హైకోర్టులో వైసీపీకి బిగ్ షాక్.. పులివెందుల కౌంటింగ్‌కు లైన్ క్లియర్

Must read

Pulivendula Municipality : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గం అయిన పులివెందులలో నాలుగు వార్డుల్లోనే కాకుండా.. అన్ని వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ, అప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీళ, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, సోమవారం ఈ పిటీషన్లపై వాదనలు ముగియగా.. ఇవాళ ఉదయం 7.30 గంటలకు దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. కిరణ్మయి తీర్పును వెల్లడించారు. వైసీపీ నేతలు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పులివెందుల మున్సిపాలిటీలో కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!