Murasu Cyclone : ఏపీని మురుసు తుపాను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, తుపాను మంగళవారం ఉదయం 7గంటల సమయంలో నెల్లూరు – నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరందాటింది. తీరందాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.. మరికొన్ని ప్రాంతాల్లో గంటలకు 120 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.



