బంగారం కొనుగోలు చేస్తున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి.. తులం రేటు ఎంతంటే..

Must read

Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. వరుసగా రెండోరోజు గోల్డ్ రేటు పెరిగింది.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరగగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 పెరిగింది. సోమ, మంగళవారాల్లో 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ. 750 పెరిగింది. అయితే, ఈవారంలో ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 20 డాలర్లు తగ్గడంతో ప్రస్తుతం అక్కడ 3,929 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,39,640 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,28,000 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,39,790 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,28,150 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,39,640కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,28,000 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,00,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,00,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,00,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!