IND vs NZ : ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 260 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. దీంతో కివీస్ 87 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
టీమ్ఇండియా బ్యాటర్లలో తిలక్ శర్మ (35; 35 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (27; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (22; 11 బంతుల్లో 4 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (21; 10 బంతుల్లో 2 సిక్సర్లు), నమన్ ధీర్ (28; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రిన్స్ యాదవ్ (18 నాటౌట్; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు మాత్రమే రెండు అంకెల స్కోర్లు సాధించారు. ఓపెనర్ సంజూ శాంసన్ (4), ఇషాన్ కిషన్ (0), అక్షర్ పటేల్ (7) లు ఘోరంగా విఫలం అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ నాలుగు వికెట్లు తీశాడు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్, మాథ్యూ ఫిషర్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆడమ్ మిల్నేఓ వికెట్ సాధించాడు.
అంతక ముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (107; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. మైఖేల్ బ్రేస్వెల్ (65; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్థశతకం చేశాడు. ఫిల్ అలెన్ (31; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డారిల్ మిచెల్ (24; 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఓ వికెట్ తీశారు.



