కూటమిలో ఫ్రెండ్లీ ఫైట్ తలనొప్పి..!

Must read

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్థానిక సంస్థల, పరిషత్ ఎన్నికల్లో అధికార కూటమికి అంతర్గత విభేదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎన్నికల్లో కూటమిగా ఉమ్మడిగా పోటీ చేయాలని, ఏ ఒక్క స్థానంలోనూ ఓట్లు చీలిపోకూడదని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధిష్టానాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక చోట్ల కూటమి క్యాడర్ ఈ నిబంధనలను పక్కనబెట్టి, ఒకే స్థానంలో ఒకరిపై ఒకరు అభ్యర్థులను నిలబెడుతూ ‘ఫ్రెండ్లీ ఫైట్’ పేరుతో బరిలోకి దిగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.

ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 62వ వార్డులో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన నేతలు ప్రత్యర్థులుగా ముఖాముఖి తలపడుతున్నారు. ఇక్కడ జనసేన పార్టీ తరఫున బొందిల శ్రీదేవి అభ్యర్థిగా బరిలో ఉండగా, తెలుగుదేశం పార్టీ తరఫున షేక్ హస్రిఫున్ నామినేషన్ వేసి పోటీలో నిలిచారు. ఇద్దరు నేతలూ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఈ వార్డులో కూటమి ఓట్లు చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇదే తరహా పొలిటికల్ వార్ ఎన్టీఆర్ జిల్లా కంచికర్లలోనూ బహిర్గతమైంది.

కంచికర్ల-4 ఎంపీటీసీ స్థానంలో కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలు ఒకరిపై ఒకరు తలపడుతున్నాయి. ఇక్కడ జనసేన అభ్యర్థిగా పసుపులేటి గోపాలకృష్ణ బరిలో నిలవగా, బీజేపీ తరఫున కాలవ మహేష్ పోటీ చేస్తున్నారు. ఉమ్మడిగా ప్రచారం చేయాల్సిన కూటమి పార్టీలు, ఇలా ఒకే స్థానంలో ఒకరిపై ఒకరు పోటీ పడుతుండటంతో క్షేత్రస్థాయిలో ఎవరికి ఓటు వేయాలో తెలియక కూటమి కార్యకర్తలు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. ఈ అంతర్గత ఫైట్ ప్రతిపక్ష వైసీపీకి లాభం చేకూరుస్తుందేమోనని కూటమి సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

The post appeared first on .

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!