విశ్వంభర రిలీజ్ డేట్ పై సస్పెన్స్.!

Must read

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర రిలీజ్‌పై ఫిలీంనగర్‌లో కొత్త టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను 2026 డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఈ వార్త ఆసక్తికరంగా మారింది. అయితే డిసెంబర్ 4న రిలీజ్ చేస్తారో లేదో తెలియదు కానీ..జస్ట్ ఒక లీకు మాత్రం తెగ వైరల్ అయిపోతుంది. మూవీ యూనిట్ నుంచి విశ్వంభర రిలీజ్‌ డేట్‌పై అఫీషియల్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

మరోవైపు విశ్వంభర విడుదలను 2027 సంక్రాంతి బరిలోకి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. జనవరి 13, 2027న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారనే ప్రచారం మరోవైపు సాగుతోంది. దీంతో డిసెంబర్ 4న వస్తుందా.? లేక 2027 సంక్రాంతికి బరిలోకి దిగుతుందా.? అన్నది సస్పెన్స్‌గా మారింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ..విశ్వంభర మూవీ షూట్‌ కంప్లీట్ అయిందని..పోస్ట్ ప్రొడక్షన్‌ జరుగుతోందని టాక్ నడుస్తోంది. వీఎఫ్‌ఎక్స్‌ రీషూట్ చేయడం వల్ల సినిమా ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఇలా ఇప్పటివరకు ఈ మూవీ విషయంలో ఏ క్లారిటీ లేదు. అంతా గజిబిజి గందరగోళం కొనసాగుతోంది. దాంతో విశ్వంభర రిలీజ్‌ ఎప్పుడోనని ఈగర్లీగా వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!