హీరో విశ్వక్ సేన్ కల్ట్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల అక్టోబర్ 25 ఆదివారం నాడు హైదరాబాద్ లో విశ్వక్ ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసారు. అయితే విశ్వక్ తో ఫోటో దిగడానికి చాలా మంది వచ్చారు. ఆ జనాన్ని ఈవెంట్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. జనాలు ఎక్కువడం, ఫోటోల కోసం ఒక్కసారిగా పోటీ పడటంతో మధ్యలోనే ఆపేసి విశ్వక్ వెళ్ళిపోయాడు. దీంతో విశ్వక్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వచ్చాయి.
విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్ కి లేట్ గా వచ్చాడని, రెండు గంటల పాటు అభిమానులు వేచి చూసినా ఫోటోలు ఇవ్వకుండా వెళ్లిపోయాడని, బౌన్సర్లు, ఈవెంట్ వాళ్ళు మమ్మల్ని తోసేశారని, మాతో సరిగ్గా ప్రవర్తించలేదని సోషల్ మీడియాలో రచ్చ చేసారు. దీనిపై ఆ రోజు రాత్రే క్షమాపణలు చెప్తూ ఓ పోస్ట్ పెట్టాడు. సరైన ఏర్పాట్లు లేకపోవడం, ఒక్కసారిగా జనం ఎక్కువ కావడంతో నా కోసం వచ్చిన అందర్నీ కలవలేకపోయాను అని సారీ తెలిపాడు.
నేడు కల్ట్ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించగా మీడియా నుంచి ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది. దాంతో విశ్వక్ స్పందిస్తూ.. మేము ఫ్యాన్స్ మీట్ కి ప్రిపేర్ అయ్యాము. కానీ మా ఆర్గనైజర్స్ నుంచి కూడా తప్పు ఉంది. ఎంత ప్రిపేర్ అయినా ఊహించిన దాని కంటే ఎక్కువ మంది వచ్చారు. ఆ రోజు వచ్చి వెనక్కి తిరిగి వెళ్లిన వాళ్లకు సారీ. భవిష్యత్తులో అలాంటి తప్పు మళ్ళీ జరక్కుండా చూసుకుంటాను అని తెలిపారు.



