నిహారిక నిర్మాతగా కొత్త సినిమా అనౌన్స్.. పాకెట్ రాకెట్స్..

Must read

Niharika : మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వరుస విజయాలు సాధిస్తుంది. కమిటీ కుర్రాళ్ళు, రాకాస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించింది. కమిటీ కుర్రాళ్లు సినిమాతో నేషనల్ అవార్డు కూడా సాధించింది. తన అన్న వరుణ్ తేజ్ తో బరి అనే సినిమా ప్రకటించింది. తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించింది నిహారిక.

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్ పై ద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాణంలో రుద్ర అత్రి దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రకటించారు. త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్), కొత్త నటుడు నిర్మల్ హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా పాకెట్ రాకెట్స్ అనే సినిమాని ప్రకటించారు.

Also See :

ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే కథతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌‌ని, కాన్సెప్ట్ పోస్టర్‌ని రిలీజ్ చేసారు. విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం, ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా రానుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. త్వరలోనే టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!