ఏపీలో కరవు లేదు.. తెలంగాణలోనే ఎందుకు? చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు!

Must read

  • ఏపీ నీటి నిర్వహణపై కేటీఆర్ ప్రశంసలు..
  • తెలంగాణ కరవుపై రేవంత్ సర్కార్‌కు ప్రశ్నలు
  • కరవు వేళ మూసీ సుందరీకరణ ఎందుకు?
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్

KTR Comments : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నీళ్ల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో కరవు పరిస్థితులు లేకపోవడానికి నీటి నిర్వహణ, ముందస్తు ప్రణాళిక కారణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఏపీలో నీటిని ఎత్తిపోసుకుని సాగుకు ఇబ్బందులు తగ్గించారని పేర్కొంటూ ఏపీ సీఎం చంద్రబాబును కేటీఆర్ అభినందించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ కరవు, క్రాప్‌ హాలిడే పరిస్థితులు లేవని అభిప్రాయపడ్డారు..

రాష్ట్రంలో కరువు పరిస్థితులు :
తెలంగాణలో వర్షపాతం లోటు 17 నుంచి 20 శాతం మాత్రమే ఉందని కేటీఆర్‌ తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడటానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కరవుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతున్న వివరాలను ఆయన తప్పుబట్టారు. ఒకవైపు రాష్ట్రం కరవుతో ఇబ్బందులు పడుతోందని చెబుతూ, మరోవైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తారని సూటిగా ప్రశ్నించారు..

కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు :
మూసీ అభివృద్ధి పేరుతో రూ.1.50 లక్షల కోట్ల ఖర్చు ప్రతిపాదనపై కూడా కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ప్రజల అవసరాలు, సాగునీటి సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం సరైన విధానం కాదన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలపై రాహుల్‌ గాంధీ దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన :
మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఇంకా పూర్తిగా చూడలేదని కేటీఆర్‌ చెప్పారు. వాటిని పరిశీలించిన తర్వాత తన లీగల్‌ టీమ్‌తో చర్చిస్తానని వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిలబడవని, నిజాలు కాలక్రమంలో బయటపడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా చాలామంది క్షమాపణలు చెప్పాల్సి ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!