జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హీరో – శ్రీ సత్య హీరోయిన్.. డెస్టినీ సినిమా నుంచి మెలోడీ సాంగ్ విన్నారా..

Must read

DESTINY : జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా డెస్టినీ. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై దినేష్ కుర్ర నిర్మాణంలో చెందు ముద్దు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇటీవల నందినీ రెడ్డి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేయగా తాజాగా ఈ సినిమా నుంచి లవ్ మెలోడీ సాంగ్ ని విడుదల చేసారు. ‘ఇద్దరి గుండెలపైన..’ అంటూ సాగే ఈ ప్రేమ గీతాన్ని హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసారు. ఈ పాటని మారుతి రాజా సంగీత దర్శకత్వంలో శ్రీరామ్ తపస్వి రాయగా సాయి చరణ్ భాస్కరుణి, అభిఖ్య తణికెళ్ల పాడారు. చంద్రకిరణ్ కొరియోగ్రఫీ చేసారు. ఇమ్మాన్యుయేల్, శ్రీ సత్య మధ్య ప్రేమ పాటలా సాగింది ఈ సాంగ్. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

 

సాంగ్ రిలీజ్ అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. పాట చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ విన్నాను. అది కూడా బాగుంది. ఇమాన్యుయేల్ నాకు చాలా క్లోజ్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని బెస్ట్ విషెస్ తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!