కుమార్తె గెలవకపోతే..? బొత్సాకు అగ్నిపరీక్ష..!

Must read

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కింగ్ మేకర్ గా చక్రం తిప్పిన సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్సా సత్యనారాయణకు ప్రస్తుత జెడ్పీటీసీ ఎన్నికలు అత్యంత క్లిష్టమైన సవాల్‌గా మారాయి. జిల్లా మొత్తం ఒకెత్తయితే, గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని బొండపల్లి జెడ్పీటీసీ స్థానం ఇప్పుడు బొత్సా రాజకీయ భవిష్యత్తును శాసించే స్థాయికి చేరింది. ఇక్కడి నుంచి తన కుమార్తె డాక్టర్ బొత్సా అనూషను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దించిన బొత్సా, ఆమెను ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు జిల్లా పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఈ ఎన్నికల్లో బొత్సా ఇంతలా ఒత్తిడికి లోనవడానికి ప్రధాన కారణం తాడేపల్లి ప్యాలెస్‌లో తన పొలిటికల్ వాల్యూ ఎక్కడ పడిపోతుందోననే భయమే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఉత్తరాంధ్ర వ్యవహారాల్లో ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్న బొత్సా, సొంత నియోజకవర్గంలో లేదా సొంత జిల్లాలో తన కుమార్తెను కూడా గెలిపించుకోలేకపోతే అధిష్టానం వద్ద తీవ్ర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా జగన్ చేత ప్రమోషన్ పొందిన కుమార్తెను, నేడు ఎమ్మెల్యే బరిలో కాకుండా కేవలం ఒక మండలానికి జెడ్పీటీసీగా పోటీ చేయిస్తున్న తరుణంలో.. ఇక్కడ కూడా ప్రతికూల ఫలితం వస్తే జగన్ వద్ద బొత్సా మాట చెల్లుబాటు కాకుండా పోయే ప్రమాదం ఉందనే చర్చ నడుస్తోంది.

దీనికి తోడు, ఉత్తరాంధ్ర రీజియన్‌పై తన పట్టు పూర్తిగా జారిపోతుందనే కంగారు కూడా బొత్సాను వెంటాడుతోంది. ఇప్పటికే ఆయనకు రైట్ హ్యాండ్‌లా ఉన్న మేనల్లుడు, మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ వీడి తెలుగుదేశంలో చేరడంతో జిల్లాలో బొత్సా వర్గం పూర్తిగా ఒంటరైంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ సైతం నైరాశ్యంలో ఉన్న వేళ, కూటమి తరఫున ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాదాసీదా మధ్యతరగతి మహిళ పాశాల నీరజ పోటీకి నిలబడటం ఆసక్తిని రేపుతోంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తన సామ్రాజ్యం, ఒక సాధారణ మహిళ చేతిలో ఓడిపోతే రాజకీయంగా కోలుకోవడం అసాధ్యమని భావించిన బొత్సా.. ఓ చదరంలో చిక్కుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

The post appeared first on .

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!