Jayakrishna Ghattamaneni : ఫస్ట్ సినిమా ఫ్లాప్.. మహేష్ అన్న కొడుక్కి హిట్ ఇవ్వడానికి రంగంలోకి దిగిన ‘బేబీ’ కాంబో..?

Must read

Jayakrishna Ghattamaneni : మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని ఇటీవల శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక రొటీన్ లవ్ స్టోరీగా ఆ సినిమా తెరకెక్కింది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రావడం, జయకృష్ణ మొదటి సినిమా కావడం, మహేష్ కూడా ఈ సినిమా గురించి పోస్టులు పెట్టడంతో సినిమాపై కాస్త బజ్ నెలకొంది. కానీ ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

జులైలో ఆ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు జయకృష్ణ నుంచి నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా జయకృష్ణ నెక్స్ట్ సినిమాపై టాలీవుడ్ లో ఓ టాక్ నడుస్తుంది. బేబీ, చెన్నై లవ్ స్టోరీ లాంటి హిట్ సినిమాలు అందించిన కాంబో నిర్మాత SKN, దర్శకుడు సాయి రాజేష్ జయకృష్ణ తో సినిమా చేయబోతున్నారని వినిపిస్తుంది.

SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తారా? లేక సాయి రాజేష్ కేవలం కథ ఇచ్చి చెన్నై లవ్ స్టోరీలా మరొకరితో డైరెక్ట్ చేయిస్తాడా తెలియాలి. సాయి రాజేష్ – SKN క్రేజీ కాంబోలో జయకృష్ణతో లవ్ స్టోరీ అంటే కచ్చితంగా అంచనాలు ఉంటాయి. హీరోపైన అంచనాలు లేకపోయినా ఈ కాంబోపై, వీళ్ళు తీసే లవ్ స్టోరీలపై కచ్చితంగా అంచనాలు ఉంటాయి. మరి సాయి రాజేష్, SKN కలిసి జయకృష్ణతో సినిమా తీసి ఘట్టమనేని ఫ్యామిలీకి హిట్ ఇస్తారా చూడాలి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article