IND vs NZ : వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 199 పరుగుల లక్ష్యం నిలిచింది.
కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (89 నాటౌట్; 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఫిన్ అలెన్ (40; 25 బంతుల్లో 5 సిక్సర్లు), బెవాన్ జాకబ్స్ (37 నాటౌట్; 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. గ్లెన్ ఫిలిప్స్ (17; 14 బంతుల్లో 3 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఓ వికెట్ పడగొట్టారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 40 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ప్రిన్స్ యాదవ్ సైతం 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చాడు.
Innings Break!
#TeamIndia bowlers have done a fine job towards the backend of the innings to restrict the New Zealand total to 198/3.
Chase coming up shortly. Stay tuned.
Scorecard – https://t.co/zf4CnZQ8CD #NZvIND https://t.co/kP0vl3QVO6
— BCCI (@BCCI) October 27, 2026


