Gautam Ghattamaneni : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో కోచింగ్ తీసుకుంటున్నాడు గౌతమ్. గౌతమ్ గతంలో ఎప్పుడూ వార్తల్లో నిలవలేదు. కానీ ఇటీవల పలు సినిమాలకు లెటర్ బాక్స్ లో రివ్యూలు ఇస్తూ వైరల్ అవుతున్నాడు. సినిమాలకు రివ్యూ, రేటింగ్ లు ఇచ్చే లెటర్ బాక్స్ యాప్ లో గతంలో పలు సినిమాలకు రేటింగ్స్ ఇచ్చి, తన తండ్రి ఫ్లాప్ సినిమాలకు తక్కువ రేటింగ్స్ ఇచ్చి వైరల్ అయ్యాడు.
టాక్సిక్ సినిమా సమయంలో 0.5 రేటింగ్ ఆ సినిమాకు ఇచ్చి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అప్పుడే అతనిపై పలువురు విమర్శలు చేసారు. తాజాగా నాని ది ప్యారడైజ్ సినిమాకు దారుణంగా 1 రేటింగ్ ఇచ్చి ఎమోషనల్ నటన, కొన్ని సీన్స్ తప్ప ఏం బాలేదు, ఎడిటింగ్ చెత్తగా ఉంది అని రివ్యూ కూడా రాసాడు. దీంతో గౌతమ్ రివ్యూ వైరల్ గా మారింది. పలువురు నాని ఫ్యాన్స్ ఈ విషయంలో గౌతమ్ ని ట్రోల్ చేస్తున్నారు. మొదట ట్రోల్స్ వచ్చినప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో లెటర్ బాక్స్ లింక్ తీసేసిన గౌతమ్ ఇప్పుడు మాత్రం.. జాతీయ వార్తగా మారిన ఈ పేజీకి స్వాగతం, ఆ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తాను అని తన బయోలో పెట్టడం గమనార్హం. ఇలా సినిమాలకు నిర్భయంగా తనకు నచ్చిన రేటింగ్స్ ఇస్తూ వైరల్ అవుతున్నాడు గౌతమ్. మరోవైపు మహేష్ బాబు మాత్రం పలు సినిమాలకు అదిరిపోయిందని ట్విట్టర్ లో పోస్టులు పెడుతుంటారు.
Also Read : Sai Pallavi : బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా సినిమాలు.. రెండు వేరియేషన్స్.. నవంబర్ లో సాయి పల్లవి హవా..
మన తెలుగులో హీరోల అభిమానులు తమ హీరో సినిమా ఫ్లాప్ అయినా అది ఫ్లాప్ అని చెప్తే ఒప్పుకోకపోగా తిడతారు. ఇప్పుడు గౌతమ్ విషయంలో అదే జరుగుతుంది. ఇప్పటికే యశ్, నాని ఫ్యాన్స్ తో విమర్శలు చేయించుకున్న గౌతమ్ ఈ రేటింగ్ లు, రివ్యూలు ఇలాగే కంటిన్యూ చేసి రాబోయే సినిమాలకు కూడా తక్కువ రేటింగ్స్ ఇస్తే ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో గౌతమ్ ని ఆడుకోవడం ఖాయం. ఇలా గౌతమ్ హీరో అవ్వకముందే యాంటీ ఫ్యాన్స్ ని రెడీ చేసుకుంటున్నాడు. రేపు గౌతమ్ హీరోగా సినిమా రిలీజ్ అయితే అతని సినిమాకు కూడా ఆయా హీరోల అభిమానులు దారుణమైన రివ్యూలు, రేటింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది.
అయితే కొంతమంది మహేష్ ఫ్యాన్స్, సినిమా ప్రేమికులు మాత్రం గౌతమ్ ఎవరికీ భయపడకుండా తనకు నచ్చిన రేటింగ్ ఇస్తున్నాడు. సినిమా ఎలా ఉందో నిజం చెప్తున్నాడు అంటూ పొగుడుతున్నారు. మొత్తానికి ఈ లెటర్ బాక్స్ రివ్యూల పుణ్యమా అని గౌతమ్ బాగా వైరల్ అవుతూ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు.


