Cyclone Arnab : ‘అర్నబ్’ తుఫాను ఎఫెక్ట్.. మూతపడ్డ థియేటర్లు.. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే..

Must read

Cyclone Arnab : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ అతి తీవ్ర తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈ క్రమంలో నేడు సాయంత్రం నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది.

ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో సినిమా షోలకు బిగ్ బ్రేక్ పడింది. ​తీవ్రమైన ‘అర్నబ్’ తుఫాను హెచ్చరికలు, భారీ ఈదురుగాలులు, కుండపోత వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ విషయంలో అత్యవసర నిర్ణయం తీసుకుంది.

Also Read : Vishwak Sen : నాకు ఎన్ని డబ్బులు ఆఫర్ చేసినా అలాంటి రోల్స్ చేయను.. విశ్వక్ సేన్ కామెంట్స్..

​ప్రజల ప్రాణ భద్రత, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. ​నేడు (27.10.2026) మధ్యాహ్నం నుంచి అన్ని థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసారు. ​రేపు (28.10.2026) రోజంతా కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని సినిమా థియేటర్లలో షోలు పూర్తిగా రద్దు చేసారు. ​వాతావరణ పరిస్థితులను సమీక్షించిన అనంతరం తిరిగి 29.10.2026 నుంచి థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది. ​ఈ ఆదేశాలను కాకినాడ జిల్లాలోని అన్ని థియేటర్ యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒకవేళ తుఫాను తగ్గకపోతే ఈ ఆదేశాలు ఆ తర్వాత కూడా పొడిగిస్తారని తెలుస్తుంది. తుఫాను ఎఫెక్ట్ తో థియేటర్స్ మూసివేయడం కొనసాగితే అక్టోబర్ 30న రిలీజయ్యే ఆదర్శ కుటుంబం, కల్ట్, కిల్లర్ సినిమాలు ఎఫెక్ట్ అవ్వక తప్పదు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!