- బంగాళాఖాతంలో సైక్లోన్ కలకలం.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్
- అక్టోబర్ 28న తుఫాన్ ఎంట్రీ.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం
- ఏపీ తీరం వైపు అర్నబ్ తుఫాన్.. తెలంగాణకు వర్ష సూచన ఉందా?
Cyclone Arnab Forecast : బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అర్నబ్ తుఫాన్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయా? ఏ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీకి తుఫాన్ ముప్పు.. తీర ప్రాంతాల్లో టెన్షన్ :
వాతావరణ అంచనాల ప్రకారం.. అర్నబ్ తుఫాన్ అక్టోబర్ 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది.
Read Also : Cyclone Arnab Alert : ఏపీ తీరానికి తుఫాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం, ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు!
చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ 27, 28 తేదీల్లో తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి అవసరం. అయితే, జిల్లాల వారీగా హెచ్చరికలు, తుఫాన్ దిశలో మార్పులను గమనిస్తుండాలి..
తెలంగాణలోనూ వర్షాలు పడతాయా? :
తెలంగాణ ప్రజలకు కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రానికి భారీ వర్షాల హెచ్చరికలు లేవు. అయినప్పటికీ తుఫాన్ తీరం దాటిన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం, మోస్తరు ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది. స్థానిక పరిస్థితులను బట్టి వర్షాల్లో మార్పులు ఉండొచ్చు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే :
తీర ప్రాంత ప్రజలు అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. బలమైన గాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండొద్దు.. వదంతులను నమ్మకుండా ఐఎండీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖల అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి.


