Cyclone Arnab Alert : ఏపీ తీరానికి తుఫాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం, ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు!

Must read

  • ఏపీ తీరంపై తుఫాను పంజా.. ప్రజలకు బిగ్ అలర్ట్
  • ముంచుకొస్తున్న ముప్పు.. చంద్రబాబు ఆదేశాలు
  • పంటలా.. ప్రాణాలా? తుఫానుపై రైతులకు కీలక సూచనలు

Cyclone Arnab Alert : బంగాళాఖాతంలో తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా అధికారులు అప్రమత్తమయ్యారు.

సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు :
తుఫాను ముప్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆర్టీజీఎస్ సహా విపత్తు నిర్వహణ అధికారులు, సీఎస్ సాయిప్రసాద్, ఆయా జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ఎప్పటికప్పుడూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

అంతేకాదు.. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి :
తుఫాను సమయంలో ప్రజలు అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి. మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకోవడం, తాగునీరు, పొడి ఆహారం, మందులు, టార్చ్‌లైట్లు అందుబాటులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది.

Read Also : Cyclone Arnab Alert : బంగాళాఖాతంలో అర్నబ్ బీభత్సం.. ఏపీకి భారీ తుపాను ముప్పు.. 140 కి.మీ వేగంతో గాలులు..

బలమైన గాలులు వీచేటప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులకు దూరంగా ఉండాలి. వరదనీటిలోకి వెళ్లడం, అవసరం లేని ప్రయాణాలు చేయడం మానుకోవాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. అధికారుల సూచనల మేరకు మాత్రమే ముందుకు కదలాలి..

రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు :
తుఫాను ప్రభావంతో పంటలకు నష్టం కలగకుండా రైతులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను పరిస్థితులు అనుకూలించినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

ధాన్యం, పత్తి వంటి వ్యవసాయ ఉత్పత్తులను టార్పాలిన్లతో కప్పి ఉంచాలన్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువలను శుభ్రం చేయాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.

పంటలు, ఆస్తుల కన్నా మనుషుల ప్రాణాలే ముఖ్యమని, వదంతులను నమ్మకుండా భారత వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా అధికారుల హెచ్చరికలను ప్రజలందరూ అనుసరించాలన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!