CM Chandrababu Naidu : తెలంగాణ మంత్రి సీతక్కపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్..

Must read

CM Chandrababu Naidu : కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, తాము చేస్తున్న అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతోందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి చంద్రబాబు మాట్లాడారు. స్థానిక ఎన్నికల నిర్వహణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశంతో విధ్వంసానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.

Also Read : LPG Strike Alert : గ్యాస్ వినియోగదారులకు బిగ్‌షాక్.. దేశవ్యాప్తంగా సిలిండర్ల సరఫరా బంద్..?

ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ రాదు, నిధులురావు. అవి రాకపోతే రాబోయే రోజుల్లో అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. గొడవులు సృష్టించి ఎన్నికలను అడ్డుకొని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకోవాలని వైసీపీ కుట్రలు చేస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయనివ్వడం లేదని వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నామినేషన్‌‌లలో పోలీసులు మైకులు పెట్టి అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు.

వైసీపీ తరపున నామినేషన్లు వేసేందుకు సిద్ధమైన వారి ఇండ్ల దగ్గరికి వెళ్లి మీరురండి మిమ్మల్ని నామినేషన్ కేంద్రానికి తీసుకుపోతామని పోలీసులు వెయిట్ చేస్తే రాని పరిస్థితి. వచ్చిన వాళ్ళని పోలీసులు జీపుల్లో తీసుకపోయి నామినేషన్లు వేయించారు. కానీ, నామినేషన్లు వేయనీవడం లేదని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది ప్రజలు నమ్మతారని వైసీపీ పార్టీ సిద్ధాంతంగా పెట్టుకుంది. ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఫేక్ ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ఇక్కడ ఫేక్ ప్రచారం చేసి తమ కార్యకర్తలతో గొడవులు సృష్టించి.. బెంగళూరుకు వెళ్లి కూర్చుంటాడు. గతంలో తీవ్రవాదులకు కూడా ఇదేమాదిరి చెప్పా.. మెయిన్‌స్ట్రీమ్‌కి రమ్మన్న.. వాళ్ళు రాలేదు. సీతక్క అనే ఒక జనశక్తి మహిళా నాయకురాలిని మెయిన్ స్ట్రీమ్‌కి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆమె తెలంగాణలో మంత్రి‌గా ఉన్నారు. మెయిన్‌స్ట్రీమ్ అంటే హింసను విడనాడి ప్రజాస్వామ్యంపైన నమ్మకం పెట్టుకొని ప్రజాస్వామ్య హితంగా ఓట్లు అడిగే పరిస్థితి రావాలని చంద్రబాబు అన్నారు. మా సిద్ధాంతం ఒకటే.. వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్ అండ్ సర్వీస్. కానీ, వైసీపీ పార్టీ సిద్ధాంతం క్రిమినలైజేషన్, లిటిగేషన్, డిస్ట్రిక్షన్, ఫేక్ ప్రాపగేషన్ అని చంద్రబాబు విమర్శించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!