Shadab Khan : షాదాబ్‌ఖాన్ ఎల్బీడబ్ల్యూ.. ఇంగ్లాండ్‌ ‘గెలిచింది’.. అదిరిపోయే ట్విస్ట్.. చివ‌రికి పాక్ విజ‌యం..

Must read

Shadab Khan : ట్రై సిరీస్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జ‌రిగిన వన్డే మ్యాచ్‌లో పాక్ అద్భుత విజ‌యం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో డీఆర్‌ఎస్ వివాదం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించిన షాదాబ్ ఖాన్ 96 బంతుల్లో 113 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. పాక్ విజయానికి 21 పరుగులు అవసరమైన సమయంలో అతడు ఎల్బీడబ్ల్యూ గా ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ విజయం సాధించినట్లు భావించి ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. అంతేకాదండోయ్‌.. టీవీ స్ర్కీన్ల‌పై కూడా ఇంగ్లాండ్ 20 ప‌రుగుల తేడాతో గెలిచిన‌ట్లుగా చూపించారు. అయితే.. థర్డ్ అంపైర్ రిప్లేను పరిశీలించడంతో అస‌లు ట్విస్ట్ చోటు చేసుకుంది.

గస్ అట్కిన్సన్ వేసిన బంతికి షాదాబ్ ఎల్బీడబ్ల్యూగా ఔటైనట్లు ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు. దీంతో షాదాబ్ కూడా తాను ఔట్ అయిన‌ట్లు భావించి నిరాశ‌తో త‌న బ్యాట్‌ను నేల‌కొసి గ‌ట్టిగా కొట్టాడు. ఆ త‌రువాత ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాల‌నం చేయ‌డం ప్రారంభించాడు. అయితే.. థ‌ర్డ్ అంపైర్ రిప్లేను ప‌రిశీలించాడు. అల్ట్రాఎడ్జ్ లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్వల్ప స్పైక్ కనిపించింది. దీంతో షాబాద్‌ నాటౌట్ అని ప్ర‌క‌టించాడు. దీన్ని స‌ద్వినియోగం చేసుకున్న షాబాద్ త‌న జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు.

అసలు డీఆర్‌ఎస్ ఎవరు తీసుకున్నారు?

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. షాదాబ్ రివ్యూ కోరిన దృశ్యాలు తొలుత కెమెరాలో కనిపించకపోవడంతో అసలు డీఆర్‌ఎస్ ఎలా తీసుకున్నారంటూ కొందరు అభిమానులు ప్రశ్నించారు. అయితే.. మరో కెమెరా యాంగిల్‌లో షాదాబ్ రివ్యూ కోరినట్లు స్పష్టమైంది. పాకిస్థాన్‌కు అప్పటికి ఒక్క రివ్యూ మాత్రమే మిగిలి ఉండటంతో, విజయంపై ఆశలు అంతగా కనిపించకపోయినా షాదాబ్ దానిని ఉపయోగించుకున్నాడు. చివరకు ఆ నిర్ణయమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షాదాబ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కీలక సమయంలో తనకు సహకరించిన హారిస్ రౌఫ్‌పై అతడు ప్రశంసలు కురిపించాడు. హారిస్ 19 బంతుల్లో 7 పరుగులే చేసినప్పటికీ, కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో అతడి సహకారం ఎంతో ఉందని పేర్కొన్నాడు.

‘జట్టు గెలిచినప్పుడే ఇలాంటి ఇన్నింగ్స్‌ను పూర్తిగా ఆస్వాదించగలం. నేను ఈ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు జట్టు విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి నాకంటే హారిస్‌కే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. ఆ సమయంలో టెయిలెండర్లు సాధారణంగా సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. నేను అతడికి మార్గనిర్దేశం చేయడం, అతడు నాకు సహకరించడంతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పగలిగాం.’అని షాదాబ్ తెలిపాడు.

PAK vs ENG : ఆదివారం అద్భుతం చేసిన పాక్‌.. ఇంగ్లాండ్ పై సంచ‌ల‌న విజ‌యం.. న‌భూతో న‌భ‌విష్య‌త్..!

‘గత సిరీస్‌లో పునరాగమనం చేసినప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయాను. అందుకే ఈసారి చివరి వరకు నమ్మకంతో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ మ్యాచ్‌లో మంచు ప్రభావం కూడా ఉంది. గత మ్యాచ్‌లో జరిగిన పరిణామాల కారణంగా ఇంగ్లాండ్‌ బౌలర్లు కొంత ఒత్తిడిలో ఉన్నారని భావించాను. వారిపై ఒత్తిడి పెంచగలిగితే, నేను కొట్టే స్లాట్‌ల‌లో బంతులు వేసే అవ‌కాశం ఉంద‌ని భావించాను. చివ‌రికి అదే జ‌రిగింది.’ అని షాదాబ్ అన్నాడు.

ఈ విజ‌యంతో పాక్ ట్రై సిరీస్ ఫైన‌ల్‌కు చేరుకుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!