Rahul Gandhi: యూపీలో రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం.. హైవేపై ఢీకొన్న కాన్వాయ్

Must read

Rahul Gandhi: ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ప్రమాదం తప్పింది. లక్నో విమానాశ్రయం నుంచి సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా హలియాపూర్ సమీపంలో ఈ ఘోర రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి రావడంతో, వెనుక ఉన్న ఐదు కార్లు, ఒక అంబులెన్స్ ఒకదానికొకటి వేగంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఊహించని ప్రమాదంలో రాహుల్ గాంధీ ఎలాంటి గాయాలు లేకుండా తృటిలో సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ శ్రేణులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Vangalapudi Anitha: బలపడుతున్న ‘అర్నబ్’ తుఫాన్.. గంటకు 125 కిమీ వేగంతో భీకర గాలులు.. ప్రజలకు హోంమంత్రి హెచ్చరిక!

రంగంలోకి దిగిన పోలీసులు.. గాయపడిన సిబ్బందికి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స:

కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి తీవ్రంగా ఢీకొనడంతో పలు కార్లు దెబ్బతినగా, రాహుల్ గాంధీ(Rahul Gandhi) భద్రతా సిబ్బందిలోని ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక హలియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన సిబ్బందిని వెంటనే అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన వల్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగ్గా, పోలీసులు దెబ్బతిన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!