Trump Warn Iran : ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్! మళ్లీ యుద్ధం తప్పదా? ఒప్పందానికి ఓకే చెప్పకపోతే అంతే..!

Must read

  • హర్మూజ్‌లో హైటెన్షన్.. ట్రంప్ తదుపరి అడుగు ఏంటి?
  • ఒప్పందానికి ఓకే చెప్పకపోతే అంతే సంగతులు..
  • ఇరాన్ కౌంటర్‌తో పెరిగిన టెన్షన్.. అమెరికా హెచ్చరికలు..

Trump Warn Iran : ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యకు దిగే అవకాశాలపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి.

అమెరికా దాడులతో ఇరాన్ అగ్రనాయకత్వం దెబ్బతిన్నదని, ఇప్పుడు చర్చలు జరపడానికి కూడా సరైన నాయకులు దొరకడం లేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శాంతి ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చర్చలకు నాయకుల్లేరా..? :
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ దేశానికి యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు మాత్రమే కాకుండా సమర్థమైన నాయకత్వం కూడా లేదన్నట్టుగా మాట్లాడారు. చర్చలు జరపాలంటే అవతలి వైపు ఒకరు ఉండాలని, అందుకే దాడులను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు అమెరికా తదుపరి వ్యూహంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

Read Also : Airtel vs Jio : యూట్యూబ్‌లో యాడ్స్‌కు గుడ్‌బై.. ఎయిర్‌టెల్‌, జియో యూజర్లకు బంపర్ ఆఫర్!

యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక రాజకీయ, సైనిక నేతలు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం సుప్రీం లీడర్‌గా ఎంపికైన మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపైనా పలు కథనాలు వెలువడ్డాయి. ఆయన పేరిట ప్రకటనలు వస్తున్నప్పటికీ, బహిరంగంగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అంతర్జాతీయ నౌకాయానంపై ప్రభావం :
మరోవైపు, అమెరికా మళ్లీ దాడులు చేస్తుందనే ఆందోళనల మధ్య పశ్చిమాసియాలో సైనిక కదలికలు గల్ఫ్ దేశాలను కలవరపెడుతున్నాయి. హర్మూజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ నౌకాయానంపైనా ప్రభావం చూపుతున్నాయి.

అమెరికా, ఇరాన్‌పైనే అందరి ఫోకస్ :
అమెరికా హెచ్చరికలను ఇరాన్ తేలిగ్గా తీసుకోవడం లేదు. తమ దేశ విధానాల్లో మార్పు ఉండబోదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ క్లారిటీ ఇచ్చారు. గతంలో రెండుసార్లు యుద్ధం చేసినా ఫలితం మారలేదని, మరోసారి ఘర్షణకు దిగినా అదే పరిస్థితి పునరావృతమవుతుందని వ్యాఖ్యానించారు. హర్మూజ్ నౌకా మార్గం నిర్వహణ కూడా ఇకపై గతంలో మాదిరిగా ఉండకపోవచ్చని తెలిపారు.

ఇప్పుడు అందరి దృష్టి అమెరికా, ఇరాన్ తదుపరి అడుగులపైనే పడింది. చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయా? లేక మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా? అన్నది రాబోయే పరిణామాలే తేల్చనున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!