Redmi K100 Leak : కొత్త రెడ్‌మి ఫోన్ కిర్రాక్ పుట్టిస్తోంది.. ఈ నెల 27నే లాంచ్.. ఫీచర్లపై భారీ అంచనాలివే..!

Must read

  • 16GB RAM.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్.. రెడ్‌మి K100లో అదిరిపోయే ఫీచర్లు
  • అక్టోబర్ 27న రెడ్‌మి K100 లాంచ్? లీకైన స్పెసిఫికేషన్లు ఇవే
  • 10,000mAh బ్యాటరీతో రెడ్‌మి కొత్త ఫోన్? లాంచ్‌కు ముందే భారీ అప్‌డేట్

Redmi K100 : వారెవ్వా సూపర్ ఫోన్.. రెడ్‌మి నుంచి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త ఫోన్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. అదే రెడ్‌మి K100 సిరీస్. అక్టోబర్ 27న ఈ సిరీస్ లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో, స్టాండర్డ్ రెడ్‌మి K100కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో పవర్ ఫుల్ ప్రాసెసర్, 16GB ర్యామ్, భారీ బ్యాటరీ ఉండవచ్చనే అంచనాలు టెక్ ప్రియుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి..

పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ పర్ఫార్మెన్స్ :
లీకైన సమాచారం ప్రకారం.. రెడ్‌మి K100 గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై M786BC మోడల్ నంబర్‌తో కనిపించినట్లు తెలుస్తోంది. ఇందులో క్వాల్‌కామ్ SM8750 చిప్‌సెట్ ఉండవచ్చని సమాచారం. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌గా ఉండొచ్చు. ఈ చిప్‌సెట్‌కు అడ్రెనో 830 జీపీయూ తోడైతే గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనుల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించే అవకాశం ఉంది.

Read Also : Vivo V80 5G Sale : 50MP ట్రిపుల్ కెమెరా అదుర్స్.. వివో V80 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇంత తక్కువకా..!

బెంచ్‌మార్క్ డేటా ప్రకారం.. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్టులో 2,705 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 9,885 పాయింట్లు సాధించినట్లు సమాచారం. అలాగే, ఇందులో 16GB ర్యామ్ ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావచ్చని అంచనా. అయితే, ఈ వివరాలన్నింటినీ కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

10,000mAh బ్యాటరీతో మరో స్పెషాలిటీ :
కెమెరా సెగ్మెంట్లలో రెడ్‌మి K100కు 50MP మెయిన్ కెమెరాతో పాటు అల్ట్రావైడ్ కెమెరా ఉండవచ్చని గత రిపోర్టులు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో 10,000mAh వరకు సామర్థ్యంతో భారీ బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉండవచ్చు.

ఈ సిరీస్‌లో రెడ్‌మి కె100, రెడ్‌మి కె100 ప్రో, రెడ్‌మి కె100 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఉండవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఫీచర్లు, ధర, ఛార్జింగ్ స్పీడ్ వంటి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లాంచ్ సమీపిస్తున్న వేళ, రెడ్‌మి కొత్త ఫోన్‌తో ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇవ్వనుందో చూడాలి..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!