CNAP Caller Name : స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టే కొత్త CNAP ఫీచర్.. ఇక కాల్ చేసిందో ఎవరో ఇట్టే తెలిసిపోతుంది..!

Must read

  • గుర్తుతెలియని కాల్స్ ఎవరివో ఇక తెలుసుకోవచ్చా?
  • నవంబర్ 1 నుంచి కొత్త రూల్? CNAP ఫీచర్‌పై పూర్తి వివరాలు
  • ఫోన్‌లో నంబర్ సేవ్ చేయకపోయినా పేరు కనిపిస్తుందా?

CNAP Caller Name : మీకు మొబైల్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందా? అయితే డోంట్ వర్రీ.. ఇకపై అవతలి వ్యక్తి ఎవరో ఈజీగా తెలుసుకోవచ్చు.. మొబైల్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్ రాబోతుంది. నవంబర్ 1 నుంచి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

అదే.. CNAP కాలర్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్.. దీని ద్వారా మీకు కాల్స్ చేసిన వ్యక్తి ఎవరు? ఆ ఫోన్ కాల్ ఎత్తాలా వద్దా? అనే సందేహాలకు చెక్ పెట్టొచ్చు. కాలర్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) ఫీచర్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

CNAP అంటే ఏంటి? :
సాధారణంగా మన ఫోన్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకోసం చాలామంది ట్రూకాలర్ వంటి యాప్‌లను వాడుతుంటారు.

అయితే, CNAP ఫీచర్ అందుబాటులోకి వస్తే.. టెలికాం నెట్‌వర్క్ ద్వారా కాల్ చేస్తున్న వ్యక్తి పేరును నేరుగా ఫోన్ స్క్రీన్‌పై చూపించే అవకాశం ఉంటుంది. అంటే.. ప్రతి గుర్తుతెలియని కాల్ కోసం ప్రత్యేక యాప్‌పై ఆధారపడాల్సిన పనిలేదు..

Read Also : Redmi K100 Leak : కొత్త రెడ్‌మి ఫోన్ కిర్రాక్ పుట్టిస్తోంది.. ఈ నెల 27నే లాంచ్.. ఫీచర్లపై భారీ అంచనాలివే..!

ఫోన్ స్క్రీన్‌పైనే కాలర్ పేరు :
ఈ ఫీచర్‌లో ముఖ్యమైన విషయానికి వస్తే.. మీ ఫోన్‌లో నంబర్ సేవ్ చేయకపోయినా, టెలికాం ఆపరేటర్ వద్ద అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా కాలర్ పేరు కనిపించవచ్చు. అయితే, స్క్రీన్‌పై కనిపించే పేరు సిమ్ రిజిస్టరీ వివరాలకు అనుగుణంగా ఉండొచ్చు. అందుకే అది కాల్ చేస్తున్న వ్యక్తి నిజమైన ఐడెంటిటీ అని పూర్తిగా నమ్మకూడదని కూడా గుర్తుంచుకోవాలి.

మోసపూరిత కాల్స్‌కు చెక్ పడుతుందా? :
రోజురోజుకూ పెరుగుతున్న స్పామ్ కాల్స్, సైబర్ మోసాల నేపథ్యంలో CNAP ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. కాలర్ పేరు ముందే కనిపిస్తే అనుమానాస్పద కాల్స్‌ను గుర్తించడంలో కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే, పేరు కనిపించిందని మాత్రమే కాల్ సేఫ్ అని నమ్మకూడదు.

బ్యాంకు వివరాలు, ఓటీపీ, వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో ఎవరితోనూ షేర్ చేయొద్దు.. మొత్తానికి, సీఎన్‌ఏపీ ఫీచర్ మొబైల్ కస్టమర్లకు తెలియని కాల్స్ విషయంలో మరింత అవగాహన కల్పించనుంది. కానీ, డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!