Tilak Varma World Record : టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు. బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ తన సత్తా చాటుతూ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకున్న తిలక్ వర్మ.. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతతో గతంలో ఇండోనేషియా ఆటగాడు డానిల్సన్ హవో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.
Also Read : Arshdeep Singh : చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. తొలి భారత ప్లేయర్‌గా ఘనత
న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ముందు తిలక్ వర్మ ఈ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకోవడంతో 2026లో అతడి క్యాచ్‌ల సంఖ్య 26కు చేరింది. గతంలో ఇండోనేషియాకు చెందిన డానిల్సన్ హవో 2025లో 25 క్యాచ్‌లు పట్టి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు తిలక్ మరో క్యాచ్ ఎక్కువగా పట్టి అతడిని అధిగమించాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే తిలక్ వర్మ రెండు కీలక క్యాచ్‌లు అందుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో టిమ్ సైఫర్ట్ క్యాచ్‌ను కవర్స్ ప్రాంతంలో పట్టుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా అందుకున్నాడు. ఈ రెండు క్యాచ్‌లతోనే తిలక్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.
అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు వీరే..
పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో తిలక్ వర్మ అగ్రస్థానంలో నిలిచాడు.
26 క్యాచ్‌లు: తిలక్ వర్మ (భారత్) – 2026
25 క్యాచ్‌లు: డానిల్సన్ హవో (ఇండోనేషియా) – 2025
24 క్యాచ్‌లు: మహమ్మద్ వసీమ్ (యూఏఈ) – 2024
21 క్యాచ్‌లు: షార్విన్ మునియాండీ (మలేషియా) – 2025
20 క్యాచ్‌లు: బ్రియాన్ మసాబా (ఉగాండా) – 2023
20 క్యాచ్‌లు: తంజిద్ హసన్ (బంగ్లాదేశ్) – 2025
Went for the big one. Got the edge. Arshdeep makes it count!
Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha.
#SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZVIND https://t.co/v6WjZTrydr
— Sony Sports Network (@SonySportsNetwk) October 24, 2026



