Chandrababu Naidu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Must read

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా దిల్లీ చేరుకున్న సీఎం, అమిత్ షాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ సుదీర్ఘ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి పనులు, విభజన హామీలు, కేంద్ర సాయం అందించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు లోతుగా చర్చించారు.

Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీసుల బిగ్ షాక్.. BNSS సెక్షన్ 126 కింద నోటీసులు.. అక్టోబర్ 29 వరకు డెడ్‌లైన్!

రైల్వే, ఐటీ ప్రాజెక్టులపై చర్చ.. మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం:

అమిత్ షాతో భేటీ అనంతరం, సీఎం అధికారిక నివాసంలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు (Chandrababu Naidu)సమావేశమయ్యారు. రాష్ట్రంలో వేగంగా చేపడుతున్న పలు రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వారి మధ్య చర్చ జరిగింది. ముఖ్యంగా ఏపీలో ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ ప్రాజెక్టుతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందించే అంశంపై విస్తృతంగా చర్చించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంట వివాహానికి హాజరు.. పర్యటన విశేషాలు:

ఈ కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రులతో నిర్వహించిన ఈ వరుస భేటీలు ముగిసిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ నివాసంలో జరిగిన వివాహ వేడుకకు చంద్రబాబు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!