Arshdeep Singh : చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్.. తొలి భారత ప్లేయర్‌గా ఘనత

Must read

Arshdeep Singh : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

Also Read : IND vs NZ 2nd T20 : నేడు భార‌త్‌ vs న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్‌.. జియో హాట్‌స్టార్‌లో రాదు.. మ‌రీ ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అరుదైన పీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన భారతీయ ప్లేయర్ గా ఘనత సాధించాడు. ఇప్పటి వరకు అతను 38 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కూమార్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

అర్ష్‌దీప్ సింగ్ టీ20ల్లో భారత్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 101 టీ20 మ్యాచ్ లలో 148 వికెట్లు పడగొట్టాడు. మరో 2 వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎనిమిది మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. వారిలో టీమిండియా ప్లేయర్ ఒక్కరు కూడా లేరు.

తాజాగా.. అర్ష్‌దీప్ సింగ్ భువనేశ్వర్ కుమార్ రికార్డును అధిగమించాడు. భువనేశ్వర్ 2022లో 32 టీ20 మ్యాచ్ లు ఆడగా.. 37 వికెట్లు పడగొట్టాడు. తాజాగా. అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఏడాదిలో 38 వికెట్లు పడగొట్టి అతని రికార్డును అధిగమించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్ గా నిలిచాడు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!