AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శనివారంతో అధికారికంగా ముగిసింది. అభ్యర్థులు దాఖలు చేసిన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు, అర్హత సాధించిన సరైన నామినేషన్ల(AP Local Body Elections) వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరికొద్ది గంటల్లోనే అర్హత పొందిన అభ్యర్థుల ప్రాథమిక వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వెల్లడించే అవకాశం ఉంది.
HMWSSB: హైదరాబాద్లో నీటి వృథాపై కఠిన చర్యలు.. జలమండలి ఎండీ సంచలన నిర్ణయం.. రూ.5 వేల జరిమానా!
అప్పీళ్లు, ఉపసంహరణకు గడువు.. నామినేషన్ల ప్రక్రియలో కీలక ఘట్టాలు:
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ తిరస్కరణకు గురైన అభ్యర్థులు శనివారం (అక్టోబర్ 25న) అప్పీల్ చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. ఈ దాఖలైన అప్పీళ్లను అక్టోబర్ 26న పరిష్కరించనుండగా, పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 27 మధ్యాహ్నం 3 గంటల తర్వాతే బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.
నవంబర్ 3న జరగాల్సిన పోలింగ్ వాయిదా? ఈసీ సంచలన కసరత్తు:
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న ZPTC, MPTC పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ, ఆ తేదీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల లెక్కింపు, భద్రతా బలగాల నిర్వహణ, ఇతర సాంకేతిక కారణాల రీత్యా పోలింగ్ తేదీని పొడిగించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పునరాలోచిస్తోంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా పోలింగ్ తేదీ మార్పుపై ఈసీ పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోందని సమాచారం.


