WhatsApp SIM Binding : బిగ్ అలర్ట్.. మీ ఫోన్‌లో సిమ్ కార్డు తీస్తే వాట్సాప్ బంద్? కేంద్రం కొత్త రూల్స్‌ ఇవే..

Must read

  • జనవరి 1 నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వాడకంలో కొత్త రూల్స్?
  • వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు అలర్ట్..
  • SIM తీస్తే యాప్‌లు పనిచేయవా?
  • వాట్సాప్ యూజర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే

WhatsApp SIM Binding : మీ స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp, Telegram వాడుతున్నారా? అయితే, మీకో ముఖ్యమైన విషయం తెలుసా? సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిమ్ బైండింగ్ నిబంధనలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త రూల్స్‌తో మెసేజింగ్ యాప్‌ల వాడకంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలేంటో ఓసారి చూద్దాం..

అసలు సిమ్ బైండింగ్ ఏంటి? :
సాధారణంగా మనం మొబైల్ నంబర్‌తో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకుంటాం.. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో సిమ్ కార్డును ఫోన్ నుంచి తీసేసినా, మరో డివైజ్‌లో యాప్‌ను వాడే అవకాశం ఉంటుంది.

అయితే, కొత్త నిబంధనల ప్రకారం.. యాప్ అకౌంట్‌ను రిజిస్ట్రేషన్ కోసం వాడిన SIM కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఫోన్‌లో సంబంధిత సిమ్ లేకపోతే యాప్ సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

ఈ రూల్స్ ఎందుకు తీసుకొస్తున్నారు? :
కొంతమంది సైబర్ నేరగాళ్లు భారతీయ మొబైల్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేయొచ్చు. ఆ తర్వాత విదేశాల నుంచి వాటిని ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి మోసాలను అరికట్టడం, నేరగాళ్లను గుర్తించడమే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం..

Read Also : iPhone Duo Sale : ఐఫోన్ డ్యూయో సేల్ స్టార్ట్.. ధర రూ. 4.5 లక్షలు, భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్.. కొనాలంటే ఇలా చేయండి!

ఏ యాప్‌కు ఎలాంటి మార్పులు? :
రిపోర్టుల ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లకు సిమ్ బైండింగ్ నిబంధనలు వర్తించనున్నాయి. ఆపిల్ కూడా ఈ మార్పులకు అనుగుణంగా iOSలో సాఫ్ట్‌వేర్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, స్నాప్ చాట్ కు కూడా ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించినట్లు సమాచారం. సిగ్నల్ విషయంలో మాత్రం ప్రభుత్వ నోటీసులపై స్పందనకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు.

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ :
ఇదిలా ఉంటే, ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లోనే లింకులను ఓపెన్ చేసే ఇన్‌యాప్ బ్రౌజర్ ఫీచర్‌ను అందించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రతి లింక్ కోసం సఫారీ లేదా క్రోమ్ బ్రౌజర్‌కు మారాల్సిన అవసరం తగ్గవచ్చు.

మొత్తానికి, కొత్త సిమ్ బైండింగ్ నిబంధనలు అమల్లోకి వస్తే మెసేజింగ్ యాప్‌ల వినియోగంలో మార్పులు రావచ్చు. అయితే, కచ్చితమైన అమలు విధానం, యూజర్లపై ప్రభావంపై అధికారిక మార్గదర్శకాలను ఓసారి చెక్ చేయడమే మంచిది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!