Upcoming Royal Enfield Bikes : రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో కొత్త రచ్చ.. 750cc ఇంజిన్‌తో 3 ఖతర్నాక్ బైక్స్, మరో ఎలక్ట్రిక్ సర్‌ప్రైజ్!

Must read

  • కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా?
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 5 అదిరిపోయే బైక్స్
  • 750 సీసీ బైక్స్‌తో పాటు ఎలక్ట్రిక్ బైక్ కూడా
  • హిమాలయన్ 750 నుంచి ఫ్లయింగ్ ఫ్లీ వరకు..

Upcoming Royal Enfield Bikes : రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే బైక్ కొనకుండా మరికొంత కాలం వేచి ఉండటమే బెటర్.. ఎందుకంటారా? ఈ ప్రముఖ టూవీలర్ కంపెనీ నుంచి కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అడ్వెంచర్ రైడింగ్‌ను ఇష్టపడేవారి నుంచి క్లాసిక్ బైక్స్‌ను కోరుకునే వారి వరకు ఆకట్టుకునేలా 5 కొత్త బైక్స్ రెడీ అవుతున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఈ రాబోయే రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులలో 3 750 సీసీ బైక్స్ ఉండటం విశేషం. పూర్తి వివరాలేంటో ఓసారి పరిశీలిద్దాం..

1. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 :
అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం హిమాలయన్ 750 అతి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో కొత్త 750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉండొచ్చు. సుమారు 55hp పవర్, 60Nm టార్క్‌ను అందించవచ్చని అంచనా. లాంగ్ రైడ్స్, కొండ ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువుగా ఈ బైక్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. 2026 నవంబర్‌లో EICMA వేదికగా ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

2. కాంటినెంటల్ జీటీ 750 :
స్పోర్టీ లుక్, ఎక్కువ పవర్ కోరుకునేవారికి కాంటినెంటల్ జీటీ 750 అద్భుతంగా ఉంటుంది. ఇందులో 750cc ఇంజిన్‌తో పాటు స్పోర్టీ హ్యాండిల్స్, రెండు వైపులా పైకి ఉండే ఎగ్జాస్ట్‌లు వంటి ప్రత్యేకతలు.. 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Read Also : PhonePe Firecracker Insurance : దీపావళి క్రాకర్స్‌తో జాగ్రత్త.. ఫోన్‌పేలో జస్ట్ రూ.11కే రూ. 25వేల ఆరోగ్య బీమా.. ఫుల్ కవరేజ్ ఇలా..!

3. ఇంటర్‌సెప్టర్ 750 :
క్లాసిక్ లుక్‌తో మరింత పవర్ ఫుల్ బైక్ కోరుకునేవారికి ఇంటర్‌సెప్టర్ 750 అద్భుతమైన ఆప్షన్ కావచ్చు. ఇందులో ట్విన్ డిస్క్ బ్రేకులు, మెరుగైన సస్పెన్షన్‌తో పాటు కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

4. స్క్రామ్ 450 :
సిటీ జర్నీతో పాటు అప్పుడప్పుడు ఆఫ్‌రోడ్ రైడింగ్ చేసేవారి కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి స్క్రామ్ 450 మోడల్ బైక్ రాబోతుంది. ఇందులో 452cc ఇంజిన్, సుమారు 40hp పవర్ ఉండవచ్చని అంచనా. 2027 ప్రారంభంలో లాంచ్ కావచ్చని తెలుస్తోంది.

5. ఫ్లయింగ్ ఫ్లీ S6 :
ఈ లిస్టులో ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ S6 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పెట్రోల్ అవసరం లేకుండా నడిచే ఈ బైక్‌లో రైడింగ్ మోడ్స్, టచ్‌స్క్రీన్, నావిగేషన్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ఈ బైక్స్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధరలు, లాంచ్ తేదీలు ప్రస్తుత అంచనాలు మాత్రమే.. కంపెనీ అధికారిక ప్రకటన తర్వాతే పూర్తి వివరాలు రివీల్ కానున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!