Meta: మెటా సంస్థకు ఊహించని షాక్.. రూ.2.3 లక్షల కోట్ల భారీ పెనాల్టీ.. అమెరికా చరిత్రలోనే మైండ్ బ్లాకింగ్ తీర్పు!

Must read

Meta: సోషల్ మీడియా రారాజు, టెక్ దిగ్గజం ‘మెటా’ (Meta)కు న్యాయస్థానంలో ఊహించని కోలుకోలేని భారీ షాక్ తగిలింది. వినియోగదారుల డేటా గోప్యత విషయంలో యూజర్లను తీవ్రంగా మోసం చేసి, తప్పుదారి పట్టించిందనే తీవ్ర ఆరోపణల కేసులో న్యూ మెక్సికో కోర్టు మెటాను దోషిగా నిర్ధారించింది. ఈ ఉల్లంఘనలకు గానూ ఏకంగా 25 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2.3 లక్షల కోట్లు) పెనాల్టీ చెల్లించాలని ఆదేశించింది. అమెరికా కార్పొరేట్ చరిత్రలోనే ఒకే కంపెనీపై విధించిన అతిపెద్ద జరిమానాల్లో ఒకటిగా నిలిచిన ఈ సంచలన తీర్పు గ్లోబల్ టెక్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

Hyderabad Traffic Diversions: హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. నేటి నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో ప్రయాణిస్తే ఇబ్బందులే!

కేంబ్రిడ్జ్ అనలిటికా కేసే శాపం.. మిలియన్ల యూజర్ల డేటా చోరీపై న్యూ మెక్సికో చర్యలు:

2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఫేస్‌బుక్ వినియోగదారుల సమ్మతి లేకుండా మిలియన్ల కొద్దీ యూజర్ల వ్యక్తిగత డేటాను ‘కేంబ్రిడ్జి అనలిటికా’ అనే బ్రిటిష్ కన్సల్టింగ్ సంస్థ సేకరించి, రాజకీయ ప్రచారాల కోసం దుర్వినియోగం చేసిందనే పాత సంచలన ఆరోపణలే ఈ కేసు మూలాలు. ఈ డేటా ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ 2021లో మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీపై దావా వేశారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో కోర్టు ఈ భారీ శిక్ష ఖరారు చేసింది. నిజానికి 219 బిలియన్ డాలర్ల పెనాల్టీ పడుతుందని అంచనా వేసినప్పటికీ, న్యాయమూర్తి దానిని 25 బిలియన్ డాలర్లకు తగ్గించి ముగించారు.

ఆందోళనలో మెటా యాజమాన్యం.. పైకోర్టులో అప్పీల్‌కు వెళ్తామని ప్రకటన:

కోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మెటా యాజమాన్యం.. ఈ తీర్పు న్యూ మెక్సికో రాష్ట్రంలో వ్యాపారం చేయడాన్ని అత్యంత క్లిష్టంగా మారుస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయంపై పైకోర్టుకు అప్పీల్ వెళ్తామని, అక్కడ తమకే విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేసింది. మరోవైపు, రెండు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మెటా కంపెనీకి ఈ 25 బిలియన్ డాలర్ల జరిమానా పెద్ద మొత్తం అయినప్పటికీ, విచారణలు ఏళ్ల తరబడి సాగే అవకాశం ఉన్నందున కంపెనీ ఆర్థిక స్థితిపై తక్షణ ప్రభావమేమీ పడదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!