IND vs NZ : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. నాలుగేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్‌కు తుది జట్టులో చోటు దక్కింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి బెంచీకే పరిమితం అయ్యాడు.
‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. తక్కువ సమయంలోనే మ్యాచ్ ఆడుతున్నాము. పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. పరిస్థితులకు అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. జట్టులోని ప్రతి ఒక్కరూ ఎంతో చక్కగా ఆడుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే.. ఇక్కడ బౌలింగ్ చేయడం అంత సులభం కాలేదు. నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు.’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
IND vs NZ : భారత్ vs న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ నేడే.. జియోలో రాదు.. ఎక్కడ చూడొచ్చంటే?
‘టాస్ గెలిస్తే మేము కూడా బౌలింగ్ చేసే వాళ్లం. పిచ్ కొత్తగా కనిపిస్తోంది. ఒక పెద్ద సిరీస్ కోసం జట్టులోని ఆటగాళ్లంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. భారత్‌తో ఆడటం చాలా బాగుంటుంది. ఆల్‌రౌండర్లు చాలా మంది ఉన్నారు. మంచి గేమ్ కానుంది.’ అని మిచెల్ సాంట్నర్ అన్నాడు.
న్యూజిలాండ్ తుది జట్టు ఇదే..
ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్
భారత తుది జట్టు ఇదే..
సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్
Toss
#TeamIndia have won the toss and elected to bowl in the 1⃣st T20I.
Here’s a look at the Playing XI
Updates
https://t.co/ADfFnxXGzz
#NZvIND https://t.co/B70ADmwdHI
— BCCI (@BCCI) October 22, 2026

Toss 
https://t.co/ADfFnxXGzz
