Janasena Party : జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 14 స్థానాలకు పేర్లు ఖరారు..

Must read

Janasena Party : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాకు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. తొలి విడతలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 12 మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.

Also Read : TDP Candidates First List: స్థానిక సమరానికి టీడీపీ తొలి జాబితా విడుదల.. 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు అభ్యర్థుల ప్రకటన!

కార్పొరేషన్లు..
కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు మొత్తం నాలుగు కార్పొరేషన్ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. తొలి జాబితాలో రెండు స్థానాలకు ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.
ఏలూరు : రెడ్డి అప్పలనాయుడు
విజయవాడ : వంగవీటి రాధాకృష్ణ

మున్సిపాలిటీలు ..
కూటమి పొత్తుల్లో బాగంగా జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. తొలి జాబితాలో 12 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.
1. అమలాపురం : నల్లా శ్రీధర్
2. చిలకలూరిపేట : తోట రాజరాజేశ్వరి
3. గొల్లప్రోలు : కడారి తమ్మయ్య నాయుడు
4. నరసాపురం : కొత్తపల్లి శైలజ
5. నిడదవోలు : కల్లం జ్యోతి
6. పెడన : మట్టా శివపావని
7. పిఠాపురం : డాక్టర్ బీరా విజయ్ శేఖర్
8. పుత్తూరు : డి. ఏలుమలై
9. సాలూరు : గొర్లె విజయకుమారి
10. సామర్లకోట : పిట్టా జానకి రామారావు
11. తెనాలి : తోటకూర వెంకట రమణారావు
12. తిరువూరు : పి. మాధవి

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!