Jabardasth Emmanuel : జబర్దస్త్ ఇమాన్యుయేల్ మెయిన్ లీడ్ లో శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘డెస్టినీ’. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై దినేష్ కుర్ర నిర్మాణంలో చెందు ముద్దు దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను నందినీ రెడ్డి రిలీజ్ చేసి టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు.
Also Read : Sandeep Reddy Vanga : రణబాలి సినిమాపై సందీప్ రెడ్డి వంగ రివ్యూ.. నెక్స్ట్ యాక్షన్ హీరో నువ్వే అంటూ..
ఈ పోస్టర్ను గమనిస్తుంటే.. ‘డెస్టినీ’ టైటిల్ తో పాటు సంకెళ్లు.. ఇమాన్యుయేల్ తో పాటు పక్కనే ఉన్న కానిస్టేబుల్.. ఆ దారి.. ఆ అడవి ఇవన్నీ చూస్తుంటే.. ఇంట్రెస్టింగ్ కథతో ఉండబోతుందని తెలుస్తుంది. టైటిల్ లోగోలో కూడా ఇమ్మాన్యుయేల్, ఆ కానిస్టేబుల్ కనిపిస్తున్నారు. ఈ ఇద్దరి ప్రయాణమే సినిమాగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర అప్డేట్లను ప్రకటించనున్నారు.



