- ఫ్లిప్‌కార్ట్‌లో వివో T5x 5G ఫోన్ రూ. 27,499కి లిస్టింగ్
- 6GB ర్యామ్ ఫోన్ అసలు ధరపై 40శాతం తగ్గింపు
- శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ ధర రూ. 23,699కే
Flipkart Big Billion Days Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వివో, శాంసంగ్, రియల్‌మి వంటి పాపులర్ బ్రాండ్ల ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25వేల కన్నా తక్కువ ధరకే లభిస్తున్నాయి.
ఈ స్మార్ట్ఫోన్లు 7200mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరాతో సహా ఆకట్టుకునే ఫీచర్లతో వస్తాయి. ఇందులో ఏఐ ఫీచర్లు (Flipkart Big Billion Days Sale 2026) కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ సేల్ పూర్తి జాబితాను ఓసారి పరిశీలిద్దాం..
వివో T5ఎక్స్ 5G :
వివో T5x 5జీ ధర రూ.27,499గా ఉంది. 6GB ర్యామ్ వేరియంట్‌పై అసలు ధర నుంచి 40శాతం తగ్గింపు లభిస్తోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.4వేలు ఆదా చేసుకోవచ్చు. తద్వారా ధర రూ.23,261 అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ A36 5జీ :
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 5జీ (8GB ర్యామ్) ఫోన్ రూ.23,699కే కొనేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధరపై 34శాతం తగ్గింపుతో పొందవచ్చు. అయితే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే అదనంగా రూ.1,300 ఆదా చేసుకోవచ్చు. కూపన్‌తో రూ.1,000 తగ్గింపు కూడా పొందవచ్చు.
రియల్‌మి P4ఎక్స్ 5G :
ఫ్లిప్‌కార్ట్ రియల్‌మి పీ4ఎక్స్ 5జీ ఫోన్ 36శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.24,999గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2వేలు ఆదా చేసుకోవచ్చు. దాంతో అసలు ధర రూ.22,999 అవుతుంది.
నథింగ్ ఫోన్ (4b) :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2026 సందర్భంగా నథింగ్ ఫోన్ (4b) 40 శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.29,999గా ఉంది. అదనంగా, మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే మరో రూ.4వేలు ఆదా చేసుకోవచ్చు. దాంతో ధర రూ.25,999కు తగ్గుతుంది.


