BSNL Freedom 2.0 Offer : BSNL బంపరాఫర్.. జస్ట్ రూ.1కే 24GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్! ఆఫర్ ఎప్పటివరకంటే?

Must read

  • ఒక్క రూపాయితో 24GB డేటా, 2,400 SMS.. ఆఫర్ లాస్ట్ డేట్
  • కొత్త BSNL కస్టమర్లకు ఛాన్స్.. రూ.1 ఆఫర్ నవంబర్ 9 వరకు
  • రోజుకు 1GB డేటా చొప్పున మొత్తం 24GB డేటా

BSNL Freedom 2.0 Offer : మొబైల్ యూజర్లకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ కోరుకునేవారికి బంపర్ ఆఫర్‌ను మరోసారి పొడిగించింది.

తాజాగా ఫ్రీడమ్ 2.0 ఆఫర్ గడువును 2026 నవంబర్ 9 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. కేవలం రూ.1తో 24 రోజులపాటు అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌కు పొందాలంటే ఒక కండిషన్ పెట్టింది.. ఇంతకీ అదేంటో ఓసారి తెలుసుకుందాం..

రూ.1కే 24GB డేటా.. అదనపు బెనిఫిట్స్ :
బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ 2.0 ఆఫర్‌లో కొత్తగా BSNL సిమ్ తీసుకునే కస్టమర్లు కేవలం రూ.1కే 24 రోజులపాటు స్పెషల్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రోజుకు 1GB డేటా చొప్పున మొత్తం 24GB డేటా పొందవచ్చు. అంతేకాదు.. 24 రోజులపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Read Also : EPFO Big Update : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ పీఎఫ్ డబ్బులపై బిగ్ అప్‌డేట్..!

ప్రతిరోజూ 100 SMS ఫ్రీగా పంపుకోవచ్చు. 24 రోజుల వ్యవధిలో మొత్తం 2,400 SMS బెనిఫిట్స్ లభిస్తాయి. తక్కువ ఖర్చుతో మొబైల్ సేవలు పొందేవారికి ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుంది.

ఫ్రీ సిమ్ ఆఫర్ :
ఈ ఆఫర్‌లో మరో బెనిఫిట్.. కొత్త కస్టమర్లకు సిమ్ కార్డు ఫ్రీగా అందించనున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే BSNL సిమ్ వాడుతున్న పాత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు. కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి రావాలనుకునేవారే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.

ఆఫర్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే? :
బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ 2.0 ఆఫర్ గడువును నవంబర్ 9, 2026 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ను పొందాలనుకునేవారు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ స్టోర్‌ను సంప్రదించవచ్చు లేదా (BSNL Selfcare) యాప్‌లో వివరాలు తెలుసుకోవచ్చు.

Note : ఆఫర్‌కు సంబంధించిన అర్హతలు, లభ్యత, యాక్టివేషన్ విధానాన్ని రీఛార్జ్ చేసుకునే ముందు BSNL అధికారిక వెబ్ సైట్, యాప్స్‌లో చెక్ చేసుకోండి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!