శ్రీలీల తెరంగేట్రానికి మోక్షం దొరికింది

Must read

అదేంటి శ్రీలీల ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలయ్యింది ఇప్పుడు తెరంగేట్రం ఏమిటనుకుంటున్నారా. అసలు విషయం వేరే ఉంది. తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లి సందడితో టాలీవుడ్ కు వచ్చిన ఈ లేడీ డాక్టర్ ఇప్పటిదాకా హిందీ సినిమాల్లో నటించలేదు. ఆచితూచి అడుగులు వేసి కల్ట్ డైరెక్టర్ అనురాగ్ బసుకి ఓకే చెప్పింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఇంటెన్స్ లవ్ స్టోరీలో భాగమయ్యింది. షూటింగ్ జరిగింది. ఇదంతా గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం.

గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా ఎందుకో ఆ దిశగా అడుగులు పడలేదు. తర్వాత టీమ్ పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించింది. టైటిల్ నిర్ణయించని ఈ మూవీకి ఎట్టకేలకు మోక్షం దక్కనుంది. వచ్చే సంవత్సరం 2027 ఏప్రిల్ 30 రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ టి సిరీస్ అధికారికంగా ప్రకటించింది. ముంబై మీడియాలో ప్రచారం జరిగినట్టు దీనికి ఆషీకీ 3 అనే పేరు పెట్టలేదు. లీగల్ సమస్యల వల్ల వేరే ఆప్షన్లు చూస్తున్నారట. ఇంకా టైం ఉంది కాబట్టి తర్వాత ప్రకటిస్తారు.

గత కొంత కాలంగా శ్రీలీల భారీ డిజాస్టర్లు రుచి చూస్తోంది. పవన్ కళ్యాణ్ తో నటించిన ఆనందం ఉస్తాద్ భగత్ సింగ్ తో కలిగినా దాని ఫలితం తీవ్రంగా నిరాశ పరిచింది. పెర్ఫార్మన్స్ స్కోప్ దక్కిందని సంతోషపడి సుధా కొంగర పరాశక్తిలో నటిస్తే అదేమో కోలీవుడ్ భారీ ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచిపోయింది. రవితేజ మాస్ జాతర, కిరిటీ జూనియర్, నితిన్ రాబిన్ హుడ్ ఇలా వెనక్కు వెళ్లి లిస్టు చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. హీరోయిన్ గా గుంటూరు కారం ఒకటే యావరేజ్ ప్లస్ అయ్యింది.

భగవంత్ కేసరిలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుని విజయం సాధించడం ఒకటే తనకు దక్కిన పెద్ద ఊరట. ఇటీవలే కొత్త కమిట్ మెంట్ల గురించి అడిగితే త్వరలోనే చెబుతానని అంటున్న శ్రీలీల వచ్చే నెల ధనుష్ ఓమ్ లో కనిపించనుంది. సాయిపల్లవి, మమ్ముట్టితో కలిసి నటించడం పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇది కనక క్లిక్ అయితే కెరీర్ కు బ్రేక్ దక్కుతుందని ఆశిస్తోంది. ఇవి కాకుండా శ్రీలీల ఒప్పుకున్న కొత్త ప్రాజెక్ట్స్ అయితే లేవు. ప్రస్తుతం కొన్ని కథా చర్చల దశలో ఉన్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!