Thursday, September 3, 2026

Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్

Must read

Tukkuguda Nurse Rape Murder Case Ncw Investigation

తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా విచారణ చేపట్టింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన NCW.. తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. కేసులో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి, నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఏడు రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ పోలీసులను కోరింది.

నిందితుడిపై కఠిన చర్యలు

NCW చైర్‌పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి రాసిన లేఖలో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని, ఘటనకు సంబంధించిన పూర్తి పరిణామాలు, హత్యకు గల కారణాలను వెలుగులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే నిందితుడి పూర్వ నేరచరిత్రపైనా పూర్తిస్థాయిలో ఆరా తీయాలని సూచించారు.

ఆధారాలపై ప్రత్యేక దృష్టి

అత్యాచారం, హత్య, క్రిమినల్ ట్రెస్‌పాస్‌కు సంబంధించిన BNS సెక్షన్లను కఠినంగా అమలు చేయాలని NCW స్పష్టం చేసింది. వైద్య పరీక్షలు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలను భద్రపరిచి సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించింది. CDRలు సహా ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తులో భాగం చేయాలని సూచించింది.

కుటుంబానికి రక్షణ, న్యాయ సహాయం

బాధితురాలి కుటుంబానికి తగిన రక్షణ, భద్రత కల్పించడంతో పాటు అవసరమైన న్యాయ సహాయం అందించాలని NCW ఆదేశించింది. కుటుంబానికి వర్తించే చట్టబద్ధ పరిహారాన్ని కూడా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఏడు రోజుల్లో నివేదిక

కేసు దర్యాప్తు పురోగతిపై ఏడు రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ పోలీసులను NCW కోరింది. దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, ఛార్జ్‌షీట్ దాఖలు గడువు, కేసు పర్యవేక్షణకు తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేసింది. పనిచేసే మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీపడేది లేదని జాతీయ మహిళా కమిషన్ తేల్చిచెప్పింది.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!