Thursday, September 3, 2026

Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు

Must read

Maharashtra Family Welcomes Baby Girl After 200 Years Gargi

ప్రస్తుత సమాజంలో మగపిల్లాడిపై ఉండే మక్కువ ఆడపిల్లలపై ఉండడం లేదు. ఆడబిడ్డ అని టెస్ట్‌ల్లో తేలితే చాలా మంది గర్భాన్ని తొలగించేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఒక కుటుంబం అలాంటి మనస్తత్వాన్ని పక్కన పెట్టి కొత్త ఆదర్శాన్ని నెలకొల్పారు. దాదాపు నాలుగు తరాల తర్వాత.. అనగా 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఆస్పత్రి నుంచి ఇంటికి సంబరాలతో తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

A

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దహిఫాలే కుటుంబంలో దాదాపు రెండు శతాబ్దాల తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఐదో తరంలో కుమార్తె పుట్టడంతో కుటుంబ సభ్యులు సంతోషం ఉప్పొంగిపోయారు. పాపను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చే సమయంలో రథంలో ఊరేగింపు నిర్వహించారు. డప్పులు, వాయిద్యాల మధ్య బంధువులు, కుటుంబ సభ్యులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

B

ఇక పాపకు ‘గార్గి’ అని నామకరణం చేశారు. ఆడబిడ్డ జన్మించగానే కుటుంబమంతా ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించినట్లుగా అమ్మమ్మ సురేఖ దహిఫాలే తెలిపింది. చాలా మంది అబ్బాయి పుడతాడని ఆశిస్తారని.. కానీ అమ్మాయి పుట్టినప్పుడు కలిగే ఆనందం వేరు అని గార్గి తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. అమ్మాయిలు తండ్రులను ఎక్కువగా ప్రేమిస్తారన్నారు. అందుకే తాను ఎప్పుడూ అమ్మాయినే కోరుకున్నట్లు చెప్పారు.

‘ఇది మా అదృష్టం’..

గార్గి తాత లింబాజీ దహిఫలే చిన్నారిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘కుటుంబంలో ఆడపిల్ల ఉండటం ఎంతో అదృష్టం. ఇన్నేళ్లుగా మా కుటుంబంలో ఆడపిల్ల లేదనే బాధ ఉండేది. ఇప్పుడు ఆ లోటు తీరింది’’ అని ఆయన అన్నారు. తన ఇద్దరు కోడళ్లను కూడా సొంత కుమార్తెల్లాగే చూసుకున్నానని లింబాజీ తెలిపారు. ఇప్పుడు తన మనవరాలిని రథంలో సంగీతం, నృత్యాల మధ్య ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. గార్గి నాయనమ్మ సురేఖ దహిఫలే మాట్లాడుతూ.. చిన్నారి జన్మించిన విషయం తెలిసిన వెంటనే ఆమెను ఎంతో ఘనంగా ఇంటికి తీసుకురావాలని ఆస్పత్రిలోనే నిర్ణయించుకున్నామని తెలిపారు. ‘‘ఈ రోజు మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం’’ అని ఆమె అన్నారు.

సానుకూల సందేశం ఇచ్చిన కుటుంబం

ఆడపిల్లల జననంపై ఇప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాల్లో సంకుచిత ఆలోచనలు ఉన్నాయని సామాజిక కార్యకర్త అనంత్ ఇంగ్లే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దహిఫలే కుటుంబం గార్గి జననాన్ని ఘనంగా వేడుకగా నిర్వహించడం ద్వారా సమాజానికి సానుకూల సందేశం ఇచ్చిందని ప్రశంసించారు.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!