Thursday, September 3, 2026

Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?

Must read

If Your Parents Have Diabetes Will You Get It Too Aiims Doctor Explains

Diabetes: ఒకప్పుడు షుగర్ వ్యాధి అంటే 50 ఏళ్లు దాటిన వారికి వచ్చేది అనుకునేవారు. కానీ ఇప్పుడు 25-30 ఏళ్ల లోపే డయాబెటిస్ వస్తోంది. మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజు పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తల్లిదండ్రుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే తమకు కూడా వస్తుందా.? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నంత మాత్రాన వ్యాధి తప్పకుండా వస్తుందని భావించాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మధుమేహంలో ప్రధానంగా టైప్-1, టైప్-2 రకాలు ఉంటాయి. టైప్-1 సాధారణంగా పుట్టుకతో వస్తుంది. ఈ పరిస్థితిలో శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఇలాంటి వారు జీవితాంతం ఇన్సులిన్ తప్పకుండా వాడాల్సి ఉంటుంది. టైప్-1 ఉన్న ప్రతీ ఒక్కరికీ కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉండాల్సిన అవసరం లేదు.

అయితే, టైప్-2 డయాబెటిస్ మనం చాలా సాధారణంగా చూసే రకం. తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ వ్యాధి ఉంటే తర్వాత తరం వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి.  శరీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, అధిక బరువు వంటివి టైప్-2కు కారణమవుతాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే, ఇది వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరికి ఉంటే ప్రమాదం మరింత పెరుగొచ్చు.

జన్యుపరమైన ప్రభావం ఉన్నంత మాత్రాన డయాబెటిస్ తప్పనిసరిగా వస్తుందని కాదు. చురుకైన జీవనశైలి, నిత్యం వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో మార్పుల వల్ల టైప్-2 డయాబెటిస్‌ను రాకుండా చేసుకోవచ్చు. ఒక వేళ వచ్చినా ఈ నియమాలు పాటిస్తే, మళ్లీ రివర్స్ చేసే అవకాశం ఉంటుంది.

కుటుంబంలో షుగర్ ఉంటే ఏం చేయాలి.?

తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే, మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయాలి. కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నవారు తరుచుగా టెస్టులు చేయించుకోవాలి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!