138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన
ఈరోజు ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన వద్ద జరిగిన పూజ కార్యక్రమానికి తౌఫిక్ ఆహ్వానం మేరకు హాజరయ్యాము. భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించడంలో భాగస్వామ్యం కావడం మాకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండీ ఉస్మాన్, వంశీ ముదిరాజ్, మదన్ మూర్తి, జైరామ్, జియా తదితర నాయకులు పాల్గొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు మతపరమైన సమభావాన్ని, భక్తి మార్గాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రజల మధ్య ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి.








