కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన కంచికచర్ల మండలపార్టీ అధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ (కోగంటి బాబు) ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలుసుకున్నారు. ఎ.ఎమ్.సి ఛైర్మన్ గా నియమితులైన కోగంటి బాబు కి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలపటంతోపాటు శాలువాతో సత్కరించారు. తమపై నమ్మకంతో విజయవాడ ఎ.ఎమ్.సి ఛైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)కు కోగంటి బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి ఛైర్మన్ కోగంటి బాబు
