ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు రూరల్ నియోజకవర్గాల్లో కేశినేని ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకున్న 40 గ్రామాల్లో ఉద్యోగ, స్వయం ఉపాధి రంగాలపై యువతీ యువకులతో పాటు గ్రామ ప్రజలకు అవగాహన పెంచాలి. గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి నింపాలని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం పంచాయతీ ఛాంపియన్స్ , మండల సమాఖ్య అధ్యక్షురాలకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై గ్రామీణాభివృద్ధి సంస్థ, స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ, సిడాప్ (SEEDAP), ఎంప్లామెంట్ విభాగాలకు చెందిన జిల్లా అధికారులతోపాటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ విభాగాల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అధికారులు వివరించారు. నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్యం పెంచుకొని ఏ విధంగా ఉపాధి పొందవచ్చో వివరించారు. అలాగే స్వయం ఉపాధి రంగంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటానికి వున్న అవకాశాలు తెలియజేశారు.
ఈసందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కుటుంబానికో వ్యాపారవేత్త వుండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. పత్రి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త వుండే విధంగా మండల సమాఖ్య అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీ ఛాంపియన్స్ ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. అలాగే యువతీ యువకులకు ఉద్యోగం పొందేందుకు ప్రభుత్వం నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమ వివరాలు తెలియజేయాలన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో శిక్షణ పొందే విధంగా కూడా ప్రజలతో పాటు యువతీయువకులను ప్రోత్సాహించాలన్నారు. యువత ఖాళీ వుండి సమయం వృద్దా చేసుకోకుండా, చెడు మార్గాలు పట్టకుండా గ్రామాల్లో క్రీడలను అభివృద్ది చేయాలన్నారు. ఇందువల్ల యువకుల్లో పోటీతత్వం ఏర్పడి ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కుటీర పరిశ్రమలు ద్వారా జీవనోపాధి పొందే డ్వాక్రా మహిళలకు అందరికీ ఉపయోగపడే అవసరాలు గుర్తించి కామన్ పెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు సమాచారం సేకరించాలన్నారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించటమే కాకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఇందుకోసం కలెక్టర్ లక్ష్మీశ నోడల్ ఆఫీసర్ గా ఎ.ఎన్.వి.నాంచారరావు నియమించారని తెలిపారు.
అనంతరం ఎన్టీఆర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎన్.ఐ.ఆర్.డి ప్రొగ్రామ్ నోడల్ ఆఫీసర్ ఎ.ఎన్.వి.నాంచారరావు మాట్లాడుతూ పంచాయతీ ఛాంపియన్స్ ద్వారా వచ్చే స్వయం సహాయక సంఘాలకు కావాల్సిన లోన్స్ విషయం పరిశీలిస్తామన్నారు. అలాగే యూనిట్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అదే విధంగా గ్రామాల్లో అభివృద్ది గ్రామాలకు సంబంధించి స్థానిక అధికారుల దృష్టికి తీసుకువచ్చే రకరకాల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా ఎంపి కేశినేని శివనాథ్ చెప్పినట్లు గ్రామీణ యువతలో క్రీడా స్పూర్తి నింపేందుకు కూడా తగిన సహకారం అందిస్తామన్నారు.
ఆతర్వాత సిడాప్ (SEEDAP) జె.డి.ఎమ్ (జాబ్స్ డిస్ట్రిక్ మేనేజర్) సుమలత మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం కింద శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు వున్న అవకాశాలు వివరించారు. సిడాప్ ద్వారా బిఎస్సీ నర్సింగ్ చదివిన యువతీయువకులకు ట్రైనింగ్ ఇచ్చి జర్మన్ పంపిస్తున్నట్లు తెలిపారు. జర్మన్ భాష పై కూడా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను గ్రామీణ ప్రాంతాల్లోని యువతీయువకులకి తెలియపర్చి ఉపయోగించుకునే విధంగా చూడాలని పంచాయతీ ఛాంపియన్స్ కి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా స్కిల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (డి.ఎస్.డి.వో) ఎస్.శ్రీనివాసరావు, ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ సోసైటీ మేనేజర్ జనార్ధనరావు, డిస్ట్రిక్ ఎంప్లామెంట్ ఆఫీసర్ వై.ఎస్.బ్రహ్మాం, ఎన్.టి.ఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్స్ జి.వి.నరసింహారావు, సొంగా సంజయ్ వర్శ లతో పాటు డ్వాక్రా సంఘాల మండల సమాఖ్య అధ్యక్షురాలు, పంచాయతీ ఛాంపియన్స్ పాల్గొన్నారు.