ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఏప్రిల్ 16న ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు,పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలలో కాంగ్రెస్ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి ఎన్నికైన నెల్లికంటి సత్యం హైదరాబాద్లోని శాసన మండలిలో ఏప్రిల్ 7న ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దాసోజు శ్రవణ్ ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.