అందుకే ఇన్నాళ్లు మా ప్రేమను దాచిపెట్టాం : వరుణ్‌తేజ్

0
103

మెగా హీరో వరుణ్‌తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌తో తమ ప్రేమ బంధాన్ని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. వరుణ్‌, లావణ్య ప్రేమలో ఉన్నట్లుగా గతంలో కూడా చాలా సార్లు వార్తలు వినిపించాయి.కానీ వాటిని పుకార్లుగా తేల్చిపారేస్తూ వచ్చిన ఈ ప్రేమ జంట ఎంగేజ్‌మెంట్ డేట్‌ను ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు. తమ లవ్ స్టోరీపై గాంఢీవదారి అర్జున ప్రమోషన్స్‌లో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు వరుణ్‌తేజ్.లావణ్య త్రిపాఠితో తన లవ్ స్టోరీ మొదలై ఐదేళ్లు దాటిపోయిందని, ఇద్దరం మంచి స్నేహితులుగా చాలా కాలం ఉన్నామని, అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతోనే తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని వరుణ్‌తేజ్ తెలిపారు. తనకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో లావణ్య త్రిపాఠి ఒకరు అని చెప్పారు.

ముందుగా తానే లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేసినట్లు వరుణ్‌తేజ్ చెప్పారు. తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పగానే ఇరు కుటుంబసభ్యులు అడ్డుచెప్పలేదని, తమ నిర్ణయాల్ని గౌరవించి అంగీకరించారని వరుణ్‌తేజ్ తెలిపారు. లావణ్య త్రిపాఠి ఇప్పటివరకు తనకు చాలా గిఫ్ట్స్ ఇచ్చిందని, ప్రస్తుతం తాను వాడే ఫోన్ లావణ్య గిఫ్ట్‌గా ఇచ్చిందేనని వరుణ్‌తేజ్ చెప్పారు.నాకు ఏది ఇష్టమో లావణ్యకు బాగా తెలుసునని వరుణ్‌తేజ్ ప్రశంసలు కురిపించారు. లావణ్య చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుందని, కేరింగ్ పర్సన్ అని వరుణ్‌తేజ్ అన్నారు. తమ ప్రేమ విషయం ఇన్నాళ్లు దాచిపెట్టడానికి కారణం గురించి కూడా వరుణ్‌తేజ్ వెల్లడించారు.

పర్సనల్ లైఫ్‌ను ఎప్పుడూ పర్సనల్‌గా ఉంచడానికే తాను ఇష్టపడతానని, అందుకే ఇన్నాళ్లు తమ ప్రేమ విషయంలో సైలెంట్‌గా ఉన్నామని, ఎంగేజ్‌మెంట్ మాదిరిగానే పెళ్లిని కూడా సింపుల్‌గానే చేసుకుంటామని చెప్పారు. లావణ్య త్రిపాఠితో ప్రేమ, పెళ్లి గురించి వరుణ్‌తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here